E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..
Advertisement

Telugu TV Serials:  తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలు ఎంటర్టైన్ చేసేవి కానీ ఈ మధ్య సినిమాలను మించిన స్టోరీలతో సీరియల్స్ రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు టీవీ చానల్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టీవీ చానల్స్ వల్ల వస్తున్న సీరియల్స్ కి రేటింగ్ కూడా భారీగా పెరగడంతో డైరెక్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్విస్టులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ వారం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో..? ఇంటింటి రామాయణం సీరియల్ పరిస్థితి ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఇంటింటి రామాయణం..

స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్కు రేటింగ్ కాస్త తగ్గినా కూడా ఇప్పుడు పల్లవి ప్లాన్లతో ప్రేక్షకులు సీరియల్ను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. దాంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా కాస్త పెరిగినట్లు కనిపిస్తుంది. అయితే మరోవైపు సీరియల్ ఎండింగ్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డు వేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పై ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ ప్రస్తుతం ఫాన్స్ కూడా ఇదే నిజమేమో అని టెన్షన్ పడిపోతున్నారు. త్వరలోనే ఈ సీరియల్ స్టోరీ గురించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ వారం టీఆర్పీ రేటింగ్..?

Advertisement

ప్రముఖ తెలుగు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.53 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.20 ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.44, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.27, నువ్వులేక నేను లేను10.10, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Related News

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×