E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?
Advertisement

Podarillu Today Episode October 12th :ఆమెని లోపలికి తీసుకొని వెళ్తారు కన్న ఎక్కడా అని అందరూ వెతుకుతారు. అయితే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్న కన్నాని బయటకు రమ్మని పిలుస్తారు. కానీ చివరికి ఆమె వెళ్లి బయటకు రమ్మని తీసుకురాగానే కన్నా బయటకొచ్చి ఇన్నేళ్ల తర్వాత నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు అమ్మ.. ఇన్నేళ్లు నేను నీకు గుర్తుకు రాలేదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొన్ని పరిస్థితులు నన్ను కట్టిపడే సాయి అనాధగా ఉన్న నేను పసుపు పిల్లాడుగా ఉన్న నిన్ను తీసుకెళ్లి ఏ చెట్టు కింద కూర్చోబెట్టాలో అర్థం కాక వదిలేసి వెళ్ళిపోయాను. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను అంటూ అంటుంది. కన్నా బాధపడడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా బాధపడతారు. ఎపిసోడ్కి హైలెట్ సీన్ ఇదే అవుతుంది..

మహా భాదపడిందా..?

అసలు నువ్వెవరు మా ఇంట్లో సమస్యలను గురించి తెలుసుకునేందుకు.. నువ్వెందుకు దాన్ని తీసుకొని వచ్చావు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని దాన్ని తీసుకొని వచ్చావు అని నారాయణ అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా ఫీల్ అవుతుంది. చాలా బాధ పడిపోతుంది కూడా. కన్నా బాధపడుతున్నాడు అని తీసుకొని వచ్చాను అని నారాయణతో అనగానే నువ్వు అలా తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చింది. నేను చెప్పానా అది ఎలాంటిదో మీకు తెలియదు.. నేను చెప్పిన మీరు వినకుండా దాన్ని తీసుకొని వచ్చారు అది ఎంత ప్రమాదకరమో మీకే తెలుస్తుంది అని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నారాయణ ఎందుకు ఇలా అన్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ కన్నా కోసం వాళ్ళ అమ్మ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. కన్న సంతోషం ఇప్పుడు మనకు ముఖ్యం నారాయణ మళ్లీ వచ్చేసి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని అందరూ అనుకుంటారు.

మాధవ్ కు కన్నా దూరం అవుతాడా?

Advertisement

మాధవ్ కన్నాకి భోజనం పెడుతూ ఉంటే కన్నా వాళ్ళ అమ్మ తినిపిస్తాను అని పిలవగానే అక్కడికి వెళ్ళిపోతాడు దాంతో కన్నా తన చేతిలోంచి వెళ్లిపోయాడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఇక రాత్రి అవ్వగానే కన్నా పడుకోరా అని మాధవ్ అంటాడు అయితే అక్కడ కన్నా కనిపించకుండా పోతాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పడుకోవడంతో తన కన్నా తనని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ కన్నా వాళ్ళ అమ్మ దగ్గర ఉండడంతో మాధవ్ వెళ్లి పడుకుంటాడు. అది చూసినా చక్రి కేశవ అన్నయ్య బాధపడుతున్నాడేమో అని అనుకుంటాడు. ఇక కన్నా ని కోసం ఆమె చేసే సేవలు చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

నారాయణ దెబ్బకు షాక్..

ఇక ఉదయం లేవగానే జమున అందరికీ కాఫీ పెట్టి తీసుకొని వస్తుంది. అయితే అందరికీ ఇచ్చినట్లుగానే నారాయణకు కూడా ఇవ్వాలని అనుకుంటుంది. అయితే బయటికి వెళ్లి ఆమె నారాయణ కొట్టి ఇవ్వగానే అది చూసిన నారాయణ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు ఆ ప్లేట్ లో ఉన్న టీ ని విసిరి కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెను చంపేస్తాను అని మంచమెత్తి విసిరేయాలని అనుకుంటాడు.. అందరు వెళ్లి ఏంటి నాన్న ఆవేశం చంపేస్తారా ఏంటి అని నారాయణ పై సీరియస్ అవుతారు. మీరు ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్పగానే నారాయణ దీని గురించి మీకు తెలియదు రా పాలు తాగే వయసులో వారిని వదిలేసి వెళ్లిపోయింది.. ఇన్ని రోజులకి వచ్చింది అంటే ఏదో నాటకం మొదలు పెట్టడానికి వచ్చింది అని నారాయణం ఎంత చెప్పినా కూడా అందరూ కూడా చాలా సీరియస్ అవుతారు..

నారాయణ పై కన్నా సీరియస్..

Advertisement

అప్పుడు నీ వల్ల వెళ్ళిపోయింది ఇప్పుడు నాకోసం వచ్చింది కదా నువ్వు ఆవిడని ఏమైనా అంటే మాత్రం నేను అసలు ఊరుకోను అని కన్నా జమునకు సపోర్ట్ గా ఉంటాడు.. అంతే కదూ ఆవిడ జోలికి వెళ్తే నేను అస్సలు ఊరుకోను. ఆమెను ఇంట్లో నుంచి పంపించాలని చూసినా బాధపెట్టిన నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను అని అనగానే నారాయణ ఒక్కసారిగా కన్నా వైపు ఒక లుక్కేస్తాడు. ఇక అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా పెద్దవాళ్ళని పట్టుకుని ఆ మాటలు ఏంట్రా అని మహాలక్ష్మి కన్నా కి బుద్ధి చెబుతుంది. ఇక లోపలికి వెళ్లిన జమునతో అసలు ఏం జరిగింది ఆయన మీపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు. ఆవిడని చంపేసినట్లుగా నన్ను కూడా చంపేస్తాడని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని ఆమె అబద్ధం చెప్తుంది. అందరి కోసం వంట చేస్తానని వంట గదిలోకి వెళ్తుంది. అయితే చక్రి మహా అలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేవతి ఎపిసోడ్లో ఆవిడ ఇంట్లో ఉన్న డబ్బులు నీ దొంగతనం చేసి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే నారాయణకు అడ్డంగా దొరికిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Related News

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×