E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను సినిమాలకన్నా ఎక్కువగా సీరియల్స్ అలరిస్తున్నాయి.. అన్న విషయం చెప్పనక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో టీవీలలోకి వచ్చే సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. గతంలో ఈ ఛానల్ లో ప్రారంభమైన సీరియల్స్ జనాలని కాస్త ఏడిపించేసాయి.. కానీ ప్రస్తుతం ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా కుటుంబ కథ స్టోరీ తో పాటుగా లవ్ స్టోరీ కూడా ఉండడంతో జనాలు వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న.. కొత్త సీరియల్స్ సైతం మంచి రేటింగ్ నమోదు చేసుకోవడంతో ప్రతివారం ఏ సీరియల్ మంచి రేటింగ్ నమోదు చేసుకుందో తెలుసుకునేందుకు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతివారం ఎలాగైతే సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉంటాయో అలాగే సీరియల్స్ కి కూడా మంచి రేటింగ్ అనేది ఉంటుంది.. ఈవారం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఏ సీరియల్కు మంచి టిఆర్పి రేటింగ్ నమోదు అయిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం…

ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిట్లో కూడా కార్తీకదీపం 2 సీరియల్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకుంటూ వస్తుంది.. కొన్ని నెలలుగా ఈ సీరియల్ రేటింగు రోజురోజుకి పెరుగుతూ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. నిన్న మొన్నటి వరకు మంచి రేటింగ్ తో నమోదైన గుండెనిండా గుడి గంటలు సీరియల్ కూడా ఇప్పుడు ఈ సీరియల్ తో పోటీ పడుతూ వస్తుంది.. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ కి మంచి రేటింగ్ కూడా నమోదు అవ్వడంతో జనాలు ఎక్కువగా చూస్తున్నారు.. ఇక నిన్న మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పరిస్థితి దారుణంగా మారిందని టీఆర్పి రేటింగ్ చూస్తే అర్థమవుతుంది.. మరి ఈవారం టిఆర్పి రేటింగ్ బట్టి చూస్తే ఈ సీరియల్ ఐదో స్థానంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీని ప్లేస్ లోకి పొదరిల్లు సీరియల్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే మరి కొద్ది రోజుల్లోనే సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని అభిమానులు బాధపడిపోతున్నారు..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ఛానెల్ లో  కొనసాగుతున్న  ప్రతి సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. ఇకపోతే గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 11.30 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 11.26 ఉంది. పొదరిల్లు 10.95, ఇంటింటి రామాయణం 10.66, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.28, నువ్వులేక నేను లేను 9.40, నిండు మనసులు 8.21, చిన్ని 7.43, బ్రహ్మముడి 7.27.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన తాయారు.. పెద్ది, మనీష కు పెళ్లి..? శైలుకు పెళ్లి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×