E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన తాయారు.. పెద్ది, మనీష కు పెళ్లి..? శైలుకు పెళ్లి..

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన తాయారు.. పెద్ది, మనీష కు పెళ్లి..? శైలుకు పెళ్లి..
Advertisement

Podarillu Today Episode august 17th: గుడిలో పూజలన్నీ అయిపోయిన తర్వాత అందరూ బయట మాట్లాడుకుంటూ ఉండగా..  నారాయణ వినోద్ తో చాలా సీరియస్ గా మాట్లాడుతూ కనిపించడం చూసిన తాయారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. గాయత్రి కూడా తన భర్తకి నిజం చెప్తున్నాడేమో అని టెన్షన్ పడుతుంది కానీ చక్రి అదేం లేదు ఊరికే మీ అమ్మని టెన్షన్ పెట్టడానికి అని అంటాడు. ఇక వినోద్ ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఇద్దరు అని అడుగుతుంది. మాధవ్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పండి అని ఎంతగా బతిమలాడినా చెప్పలేదు అని వినోద్ చెప్పగానే తాయారు కాసేపు ఊపిరి పీల్చుకుంటుంది.. మాధవ్ మనిషా ఇద్దరు ఒక్కటైతే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు.

మహాను రెచ్చగొట్టిన తాయారు..

మొక్కులు తీర్చుకోవాలి అంటే చాలా కష్టపడాలి అంత సులువుగా మొక్కులు తీరవు అని తాయారు అంటుంది. ఎలాగైనా సరే మాధవ్ పెళ్లి జరగాలి అంటే నేను ముక్కులు తీర్చుకోవాలి అని మహాలక్ష్మి అంటుంది. మా పెద్ది కోసం నేను ఎంతకైనా కష్టాన్ని భరిస్తాను అని తాయారు దగ్గర ఛాలెంజ్ చేస్తుంది మహాలక్ష్మి.. కానీ మహాలక్ష్మి ఎంత కష్టం అది నువ్వు చేయలేవు అని వైపు మాధవ్ చెప్తున్న సరే తను మాత్రం వినకుండా నేను ఎలాగైనా ఈ పూజలు చేస్తాను అని అంటుంది. కానీ మహాలక్ష్మి చేసే పూజలు ఆ ఇంటికి మంచి చేస్తాయి. అయినా అది చాలా కష్టమైన పని కాబట్టి నువ్వు వద్దు అని అందరూ అంటారు.. వాటిని చేయాలి అంటే ఒక నిష్ట ఉండాలి ఏంటో పడితే అటు చేయడం కుదరదు అని తాయారు అంటుంది కానీ మహాలక్ష్మి మాత్రం నేను చేసి తీరుతాను అని అంటుంది. మాధవ్ మహాలక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్లి నువ్వు ఆ పూజలు చేయాలి అంటే చక్రీకి భార్యవై ఉండాలి అని అంటాడు. చక్రిని నీ భర్తగా మనస్పూర్తిగా ఒప్పుకుంటేనే ఆ పూజల ఫలితం లభిస్తుంది అని చెప్పగానే మహాలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది.

బాధపడ్డ చక్రీ.. మహా షాక్..

Advertisement

ఏంటి అన్నయ్య ఏమైంది ఏమంటున్నారు మహాలక్ష్మి గారు అని అడుగుతాడు చక్రి. తాయరు అత్తమ్మ అన్నమాటతో మహాలక్ష్మి ఆ పూజలు చేస్తాను అని అంటుంది. అవి చాలా కష్టమైన పూజలు అని నేను చెప్పాను. ఒకవేళ ఆమె చేస్తాను అన్న కూడా నేను చేయినిచేవాడిని కాదు అని చక్రి అంటాడు. ఆ కష్టం ఆవిడ పడకూడదు అంత పెద్ద ఇంట్లో పుట్టి ఇక్కడికి ఇలాంటి కష్టమైన పూజలు చేయడం ఎందుకు అని ఆపేవాడిని అని చక్రి అంటాడు. అయినా తను నీ భార్య అయితేనే తప్ప ఆ ఫలితం ఉండదు అని మాధవ్ చెప్పగానే చక్రి అవునన్నయ్య తను నన్ను ఇష్టపడుతుందా లేదా అన్నది నాకే ఒక క్లారిటీ లేదు.

మాధవ్, మనీషాను కలుపుతున్న గాయత్రి…

మాధవ్ మనిషను చూసి గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ అమ్మాయి ఎవరు చాలా బాగుంది వీళ్ళ జోడి చాలా బాగుంది అని గాయత్రి అడుగుతుంది. అయితే గాయత్రి మనిషా దగ్గరికి వెళ్లి అడిగితే తన భాష అర్థం కాక అక్కడి నుంచి వచ్చేస్తుంది.. కానీ కన్నా దగ్గరకు వెళ్లిన గాయత్రి.. అమ్మాయి ఎవరు అమ్మాయికి బావకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది.. ఆ అమ్మాయి నాతో మనం సౌత్ మనిద్దరికీ ఎలా సెట్ అవుతుంది అని కన్నా అంటాడు. ఎలాగైనా సరే బావకి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంది అని గాయత్రి ఫిక్స్ అవుతుంది..

మహాను అవమానించిన తాయారు..

Advertisement

మహా ఎలాగైనా ఈ పూజలు చేయాలి అని అనుకుంటుంది. కానీ మాధవ్ మాత్రం మహాలక్ష్మి పూజలు చేయడానికి వీలులేదు అని అనుకుంటాడు. గాయత్రి దగ్గరికి వెళ్లిన మాధవ్ ఈ పూజలు చేస్తున్నావా అని అడుగుతాడు. అవును బావ ఈ పూజలు చేయాలని మా అమ్మ కోరుకుంది అందుకే ఆమె కోరిక ప్రకారం నేను పూజలు చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. ఇక అక్కడికి వచ్చిన తాయారు మీ ఆయన పిలుస్తున్నాడు వెళ్ళు అని పంపిస్తుంది. నువ్విలా మీ ఆయనకు దూరంగా ఉంటే అనుమానం వస్తుంది. ఏంటి మహాలక్ష్మి పూజలు చేస్తాను అంది.. ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయింది అని తాయారు అడుగుతుంది అది చాలా కష్టమైన పూజ కథ తను చేయలేదు అని మాధవ్ చెప్తాడు. కాని మహాలక్ష్మి మాత్రం ఎవరికీ తెలియకుండా పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.. నారాయణ సహాయంతో ఎలాగైనా సరే పూజలను పూర్తి చేయాలని మహాలక్ష్మి అనుకుంటుంది.. ఎవరికి తెలియకుండా పూజలు చేసి పెద్దికి మంచి జరిగేలా చేయాలి అని అనుకుంటుంది మహా. శైలుకి తెలియకుండా ఎలాగైనా సరే తన ఫ్రెండ్ తో పెళ్లి చేయాలని అనుకుంటాడు సురేష్. శైలు చెప్పకుండా గుడికి తీసుకుని వెళ్లి అక్కడే పెళ్లిని చేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి ప్లాన్.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్.. ప్రభావతి దెబ్బకు షాక్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×