Telugu TV Serials : తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్త సీరియల్ ప్రసారమవుతున్నాయి. ఇక్కడ ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాలు కొన్న డిమాండ్ ఇప్పుడు సీరియల్ కి ఉంది అంటే ఆ సీరియల్స్ కి ఉన్న క్రేజ్ఏం టో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు టీవీ చానల్స్ లో కనిపిస్తూ జనాలని ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్ యాక్టర్స్ కోసం జనాలు కూడా విపరీతంగా గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. యాక్టర్స్ నటనకి ఫిదా అవుతూ వాళ్ల గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ యాక్టర్స్ కి మంచి డిమాండ్ ఉందన్న విషయం చెప్పనక్కర్లేదు. ఇక్కడ ప్రచారం అవుతున్న ప్రతి సీరియల్ యాక్టర్స్ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. యాక్టర్స్ కున్న ఫాలోయింగ్ వల్లే సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఈ వారం టీవీ సీరియల్స్ యొక్క టీఆర్పి రేటింగ్ ఏ మాత్రం పెరిగిందో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎప్పుడు కార్తీకదీపం సీరియల్ తో పోటీ పడుతూనే ఉంటుంది. కానీ కార్తీకదీపం సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఎప్పుడూ కూడా ఏసి రిలే ముందు వరుసలో ఉండడం విశేషం. డాక్టర్ బాబు దీప సీరియల్ ఎప్పటికప్పుడు జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ఈవారం ఈ సీరియల్ టాప్ లోకి రావడానికి కారణం మాలిని రివెంజ్. దీప ను ఎలాగైన చంపాలి అని మాలిని చేసిన ప్లాన్ దాదాపు వర్కౌట్ అయినట్లే.. ప్రస్తుతం చావు బతుకుల్లో దీప ఉండడంతో జనాలు చాలా ఫీల్ అవుతున్నారు. దీప త్వరగా కోలుకొని ఇంటికి రావాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్క సీన్ తో ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఎప్పటిలాగే కార్తీకదీపం సీరియల్ 12 కు పైగానే రేటింగ్ ని నమోదు చేసుకొని ముందంజలో ఉంది. మరి ఈ వారం ఈ సీరియల్ తో పాటుగా మిగిలిన సీరియల్స్ రేటింగ్ ఎలా ఉందో చూద్దాం..
స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.36 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.29 ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.36, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.56, నువ్వులేక నేను లేను, 10.40, నిండు మనసులు 9.20, చిన్ని 8.33, బ్రహ్మముడి 8.27.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత నమోదు చేసుకుంటుందో చూడాలి..