Tv Serial : ఈ మధ్య సినిమాలను మించిన గ్రాఫిక్స్ ను టీవీ సీరియల్స్ లో చూపిస్తున్నారు. కొన్ని సీన్లు చూస్తే ఏంట్రా ఇంత పెట్టారు అని షాక్ అయ్యేలా ఉంటాయి. తెలుగు టీవీ ఛానెల్స్ ఒకదానికి మించి మరొకటి కంటెంట్ తో పోటీ పడుతుంది. ముఖ్యంగా స్టార్ మా, జీతెలుగు ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీరియల్స్ లో వింత ప్రయోగాలు చేసి జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు.. ఇదంతా ఎందుకు చెప్తున్నారనే సందేహం రావచ్చు.. అందుకు కారణం కూడా ఉంది. అదేంటంటే ఓ తెలుగు సీరియల్ లోని ఓ సీన్ ని నెటిజన్లు కట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం ట్రోల్స్ కు గురైంది.. ఇంతకీ ఆ సీరియల్ పేరేంటో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు సీరియల్ గ్రాఫిక్స్ పై ట్రోల్స్..
తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ ఎక్కువగా దేవతల పేర్లతో ఉంటాయి. అందులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఓ డైలీ సీరియల్ లో ఓ సీన్లో గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసిన ఓ పాము కారును నడుపుతుంది. తనకు కోపం ఉన్న మహిళను కారుతో గుద్దేస్తుంది. ఆ తర్వాత వెనుక నుంచి మిగిలిన వాళ్లంతా తాడుతో లాగుతారు. ఇది ఫన్నీగా అనిపించడంతో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. నెటిజన్స్.. ఎక్కడైన కారును స్టార్ట్ చెయ్యాలంటే క్లచ్ అండ్ గేర్ ను ఆన్ చెయ్యాలి.. కానీ పాము ఎలా ఆన్ చేసింది? ఏదో మాయగా ఆన్ చేసింది అనుకుంటే కారు వెనుక వాళ్లంతా ఎలా వచ్చారు? ఆ తాడును ఎలా కట్టారు? ఎలా చూసిన లాజిక్ మిస్ అవ్వడంతో సీరియల్ పై ట్రోల్స్ ఓ రేంజులో వస్తున్నాయి.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ సీన్ మాత్రం ట్రెండ్ అవుతుంది.
Nothing comes closer to serial directors creativity 🌚 pic.twitter.com/RVgdQ662GE
— Arehoo_official (@tweetsbyaravind) February 27, 2025
Also Read :ఈ రోజు ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం డోంట్ మిస్..
త్రినయని సీరియల్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
జీ తెలుగులోనే కాకుండా ప్రస్తుతం తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్స్‌లో ఒకటిగా త్రినయని కొనసాగుతోంది. 2020 మార్చి 2న త్రినయని సీరియల్ ప్రారంభమైంది. నాలుగేళ్లలో ఇప్పటివరకు 1421 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి.. ఇప్పటికి సీరియల్ సక్సెస్ టాక్ ను అందుకోవడం విశేషం.. ప్రస్తుతం జీ తెలుగు సీరియల్స్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది. లేటెస్ట్ టీఆర్‌పీ లో 6.51 రేటింగ్‌ను దక్కించుకుంది. దైవ శక్తులకు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే పోరాటంలో త్రినయని అనే మహిళ ఎదుర్కొనే సంఘర్షణ నేపథ్యంలో సూపర్ నాచురల్ ఫాంటసీ డ్రామాగా ఈ సీరియల్ తెరకెక్కింది. ఆమె జీవితంలోకి విశాల్ ఎలా వచ్చాడు? విశాల్ సవతి తల్లి తిలోత్తమ కారణంగా త్రినయని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది అనే అంశాలతో ఈ సీరియల్‌ను నాలుగేళ్లుగా మేకర్స్ నడిపిస్తోన్నారు.. మొత్తానికి ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జీ తెలుగులో కొత్త ప్రయోగాత్మక సీరియల్స్ ను ప్రేక్షకులకు అందిస్తుంటారు..