Samantha Gym Video: హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా ప్రతీ సినిమాకు తమలో మార్పు వచ్చిందని ప్రేక్షకులకు చూపించడానికి ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ఫిజికల్‌గా తమను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పాత్రకు తగినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. హీరోయిన్‌గా పరిచయమయిన మొదట్లో దాదాపు ప్రతీ సినిమాలో సమంత చాలా క్యూట్‌గా ఒకేలా కనిపించేది. కానీ మెల్లగా ప్రతీ సినిమాకు తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టింది. ఇక గత కొన్నేళ్లలో తను పూర్తిగా జిమ్ ఫ్రీక్ అయిపోయింది. అలా తాజాగా సమంత జిమ్‌లో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఆ వీడియోను తెగ వైరల్ కూడా చేసేస్తున్నారు.
జిమ్‌కు నో డుమ్మా
హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమయిన కొత్త సమంత జిమ్ ఫ్రీక్ కాదు.. కానీ మెల్లగా చాలామంది ఇతర హీరోయిన్లలాగా తను కూడా జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టింది. అలా తన జిమ్ రొటీన్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకునేది. అలా తన ట్రైనర్ గురించి, తను చేస్తున్న ఎక్సర్సైజ్‌ల గురించి అన్నింటి గురించి ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసేది సామ్. తను మయాసైటీస్‌తో బాధపడుతున్న సమయంలో కూడా జిమ్‌కు డుమ్మా కొట్టలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి తను జిమ్‌లో చేసిన వర్కవుట్ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో అప్లోడ్ చేసింది. అందులో సమంత చేసిన వర్కవుట్ కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది.
చెమటలు పట్టిస్తోంది
తాజాగా 110 కిలోల బరువును తన చేతులతో కాకుండా బాడీ సాయంతో లిఫ్ట్ చేసింది సమంత. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సమంత (Samantha) జిమ్ చేస్తుంటే తమకు చెమటలు పడుతున్నాయంటూ కుర్రకారు తెగ ఫీల్ అయిపోతున్నారు. మరికొందరు అయితే వర్కవుట్స్ విషయంలో సామ్‌నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి బరువులను లిఫ్ట్ చేస్తూ పలుమార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది సమంత. మళ్లీ చాలాకాలం తర్వాత 110 కిలోల బరువును ఎత్తి తను ఎంత పెద్ద జిమ్ ఫ్రీక్ అని ప్రూవ్ చేస్తోంది.
Also Read: లీగల్ సమస్యలకు చెక్ పెట్టిన కంగనా.. ఆ సీనియర్ రైటర్‌తో కలిసి ఒప్పందం..
సినిమాలు తగ్గిపోయాయి
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. మయాసైటీస్ వ్యాధి ఉందని గుర్తించిన తర్వాత సామ్ చాలావరకు సినిమాలు తగ్గించేసింది. అలా అని ప్రేక్షకులకు పూర్తిగా దూరమయిపోలేదు. సినిమాలు కాకుండా వెబ్ సిరీస్‌ల రూపంలో వారిని ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టింది. చివరిగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది సామ్. అందులో మునుపెన్నడూ లేని యాక్షన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో యాక్షన్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది సమంత. ఎంత బిజీగా ఉన్న జిమ్‌కు వెళ్తూ ఆ అప్డేట్స్ ఫాలోవర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఈ ముద్దుగుమ్మ.
Dear girls, set some fitness goals like Samantha#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/atIfQ5FJ8q
— KingLeo🦁 (@KingLeo_007) February 27, 2025