PAK on Cricket Stadiums: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి దాయాది పాకిస్తాన్ అతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై 60 పరుగుల తేడాతో, ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో భారత్ పై ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మూడవ మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Also Read: Rohit Sharma: ఒక్క రూమ్ తో.. 2.6 లక్షల సంపాదిస్తున్న రోహిత్.. అద్దెకు ఇచ్చి మరి?
దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్కరించింది పాకిస్తాన్. 1996 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్ కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆతిథ్యం ఇచ్చినా.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ లు ఏవి గెలవకుండా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది పాకిస్తాన్. గత 23 సంవత్సరాలలో ఐసీసీ టోర్నమెంట్ కి అతిథ్యం ఇస్తూ ఒక మ్యాచ్ లోను విజయం సాధించని జట్టు పాకిస్తాన్ మాత్రమే కావడం గమనార్హం.
2013 లో ఇంగ్లాండ్ లో జరిగిన టోర్నమెంట్ లో కూడా పాకిస్తాన్ జట్టు విజయం లేకుండా, ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే టోర్నమెంట్ ని ముగించింది. కాగా చివరిసారిగా 2000 సంవత్సరంలో కెన్యా ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ జట్టు కనీసం ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఐసీసీ నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీని పొందనుంది.
పాకిస్తాన్ కి ఐసీసీ నుండి దాదాపు 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. మరోవైపు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్తాన్ కి ఐసిసి సుమారు 385 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది. ఇది కాకుండా దుబాయిలో మ్యాచులు నిర్వహిస్తున్నందుకు అదనంగా 38.2 కోట్లు చెల్లించింది. అయితే ఈ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారి దేశంలోని స్టేడియాలను {PAK on Cricket Stadiums} రినోవేషన్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Afghan Fans Warns India: ఫైనల్‌లో భారత్‌ను చిత్తు చిత్తు చేస్తాం.. అఫ్గాన్ ఫ్యాన్స్ వార్నింగ్
లాహోర్ లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ మైదానాలను అప్గ్రేడ్ చేసింది {PAK on Cricket Stadiums} పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మైదానాలను రిపేర్ చేసేందుకు ఏకంగా 1280 కోట్లను ఖర్చు చేసింది. అయితే ఇంత ఖర్చు చేసి.. చివరికి ఈ టోర్నీలో కేవలం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే నిష్క్రమించడంతో నిరాశకు గురవుతున్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు. మరోవైపు పాకిస్తాన్ ఇంత ఖర్చు చేసి ఇలా పరువు తీసుకుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 28, 2025