trinayani serial today Episode: హాస్పిటల్ బిల్లు చూసి అందరూ కంగారుపడుతుంటే అదేమీ కోర్టు నోటీసు కాదు కదా..? ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటుంది నయని. దీంతో సరే అయితే నేను హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తో నేను మాట్లాడతాను అంటాడు విశాల్. మీరెందుకు బాబు గారు నేను మాట్లాడతాను. నేను మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు అంటుంది. సరేనని అందరూ వెళ్లిపోతారు.
తిలొత్తమ్మ, వల్లభ తీక్షణంగా ఆలోచిస్తుంటే.. వెనక నుంచి హాసిని వచ్చి బెదిరిస్తుంది. వల్లభ భయంతో మమ్మీ అంటూ ఉలిక్కిపడతాడు. రేయ్ పెళ్లానికి భయపడతావేంట్రా అంటూ తిడుతుంది. మరి ఎవరికి భయపడాలి అత్తా అంటుంది హాసిని. ఎందుకు వాడిని ఏడిపిస్తావు. నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా అంటుంది తిలొత్తమ్మ. భర్త బాగోగులు చూసుకోవడమే భార్య ధర్మమని నీలాంటి ముసలోళ్లు చెప్పారు కదా అత్తయ్యా అని హాసిని అనగానే నువ్వే ముసలిదానివి చిన్న పనికే అలిసి పోతావు అనగానే అవును మమ్మీ ఒంట్లో చుక్క రక్తం కూడా లేదు అంటాడు వల్లభ.
ఇంతలో హాసిని అత్తయ్యా అని తిలొత్తమ్మన హగ్ చేసుకుంటుంది. దీంతో తిలొత్తమ్మ కోపంగా అరేయ్ దీన్ని పక్కకు లాగరా..? అనగానే వల్లభ దగ్గరకు వస్తుంటే.. నువ్వు దగ్గరకు వస్తే.. నిన్ను కూడా హగ్ చేసుకుంటాను అనగానే వల్లభ ఆగిపోతాడు. ఇంతలో హాసిని వెళ్లిపోతుంది. రేయ్ ఎందుకురా దాన్ని పట్టుకుని నాకు అప్పజెప్పలేదు అంటూ తిడుతుంది. దీంతో అది సరే మమ్మీ అసలు నీకేం అర్థం అయింది అని అడుగుతాడు. లిల్లీస్ హాస్పిటల్ లో మొన్న దురందర జాయిన్ అయింది. కానీ బిల్లు మాత్రం నయని పేరు మీద వచ్చింది ఎలాగో అది కనిపెట్టాలి అని చెప్తుంది తిలొత్తమ్మ. సరే అంటాడు వల్లభ.
రూంలో హాస్పిటల్ బిల్లులు చూస్తూ ఉంటాడు విశాల్. ఇంతలో నయని వచ్చి ఇంకా ఆ బిల్లులు చూస్తూనే ఉంటారా… అవి ఇటు ఇవ్వండి వాళ్లతో నేను మాట్లాడతాను అంటుంది. దీంతో విశాల్ ఆ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అంటాడు. వద్దని ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందామని నయని చెప్తుంది. సరే అయితే నీ ఇష్టం అంటూ నీకు ఎలాంటి మెడిసిన్ వాడారో.. అందులో ఉండాలి కదా..? అంటే డిశ్చార్జ్ చేసినప్పుడు ఇస్తారు అని నయని చెప్తుంది. దీంతో విశాల్ షాక్ అవుతాడు. డిశ్చార్జ్ ఏంటి అని అడగ్గానే అదే నేను చెప్పా పెట్టకుండా వచ్చాను కదా..? అందుకే వాళ్లు ఇలా బిల్లు పంపించారు అని సర్ది చెప్తుంది నయని. సరే అని విశాల్ వెళ్లిపోతాడు.
హాల్లో కూర్చున్న హాసిని డాక్యుమెంట్స్ మీద సంతకం చేశాను విక్రాంత్‌కు చెప్పు అటుంది. సరే వదిన కానీ రేపు ఆఫీసులో మీటింగ్‌కు మీరు కూడా రావాలని చెప్తాడు విశాల్. ఆఫీసు మీటింగ్ సరే ఇప్పుడు ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటుంది తిలొత్తమ్మ. ఏంటో చెప్పు అమ్మా అని విశాల్ అడగ్గానే అందరూ ఉండాలి నాన్నా అంటుంది తిలొత్తమ్మ ఇంతలో అందరూ వస్తారు. పిలవక ముందే అందరూ వచ్చారు ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పు అక్కాయ్ అంటాడు పావణమూర్తి. దీంతో లిల్లీస్ హాస్పిటల్‌కు ఈ నయని బిల్లు కట్టేసింది అని చెప్తుంది. మంచిదేగా అని పావణమూర్తి అంటాడు. ఆ గొడవ వదిలేయండి అయిపోయిన దాని గురించి మళ్లీ ఆలోచించడం దేనికి అంటుంది నయని. నువ్వు అత తేలికగా చెబితే ఎలా నయని. నువ్వు డబ్బులు ఎవరి కోసం కట్టావో తెలియాలి కదా..? అంటుంది తిలొత్తమ్మ.
ఇంకెవరి కోసం కట్టింది అమ్మా అంటూ విశాల్ అడగ్గానే.. ఈ నయని ఇంకోక నయని కోసం బిల్లు కట్టింది అని తిలొత్తమ్మ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అమ్మ మాటలు వింటే మతి పోతుంది బ్రో అంటాడు విక్రాంత్. మనందరిని పిచ్చోళ్లను చేసి ఆడిస్తుందిరా ఈ దేవీపురం త్రినేత్రి. అంటూ లిల్లీస్ హాస్పిటల్ వాళ్ల బిల్లు 42 లక్షలు అయితే ఈ నయని బెటర్ ట్రీట్మెంట్ కోసం మరో 8 లక్షలు కలిపి మొత్తం 50 లక్షలు ఇచ్చింది అని తిలొత్తమ్మ చెప్పగానే నయని నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడో వచ్చావు కదా..? మళ్లీ ఎక్స్ ట్రా అమౌంట్ ఎందుకు ఇచ్చావు అని విశాల్ అడుగుతాడు. ఇంతలో వల్లభ వచ్చి అక్కడ హాస్పిటల్ లో నయని లేదని చెప్తాడు. దీంతో నయని, తిలొత్తమ్మ షాక్ అవుతారు. నయని ఇక్కడే ఉంటే అక్కడ ఎలా ఉంటుంది అని విశాల్ అడుగుతాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?