Gundeninda GudiGantalu Today episode December 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజూ తో బార్ లో రాజేష్ తప్పుగా బిహేవ్ చేస్తాడు. కావాలనే గొడవ పెట్టుకుంటాడు. బాలు చూసి నా ఫ్రెండ్ ను కొడతావా అని కొడతాడు. బార్ లో పెద్ద రచ్చ చేస్తారు. సంజూ ను వదలకుండా కొడతాడు.. నేనెవ్వరో తెలుసా అని అంటాడు. కానీ బాలు మాత్రం నువ్వెవరైనా నాకేంటి అంటారు. ఇంకా నాలుగు పీకుతాడు. ఇక బార్ నుంచి బాలు ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరు లేరని చూసి మీనా దగ్గరికి వస్తాడు. కొట్టిన రాయికి పూజలు చేస్తూ పెద్ద హంగామా చేస్తాడు. ఇక మొన్నటివరకు నన్ను రౌడీ అనే వాళ్ళు.. ప్రభావతి, మీనాక్షిలు కలిసి రవి ఇంటికి వెళ్లారు. రవి తన అమ్మను చూడగానే ఎంతో సంతోషిస్తాడు. తన కోడలికి ఏమైందని ఆరా తీస్తుంది. ఇంతకీ తన కోడలు ఏది అని ప్రశ్నిస్తుంది? దీంతో రవి శృతిని పిలవడానికి వెళ్తాడు. రెస్టు తీసుకుంటున్న శృతిని నిద్రలేపే సరికి రవిపై చిరాకు పడుతోంది. అనవసరంగా తనను డిస్టర్బ్ చెయ్యొద్దంటూ అరుస్తుంది. తన మమ్మీ వచ్చిందని చెబుతాడు. దాంతో శృతి కిందకు వస్తుంది. శృతి రాగానే తన కాళ్లకు నమస్కరిస్తుందని ప్రభావతి భావిస్తుంది. కానీ, ఊహించని విధంగా వచ్చి కాలు మీద కాలు వేసుకుని సోఫాలో దర్చాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది. శోభా అక్కడకు వస్తుంది. తన కూతురును తనతో తీసుకెళ్తానని గొడవ పడుతుంది. శృతి ఇద్దరి దగ్గరకు నేను రాను.. వెళ్ళండి అని వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇంటికి వచ్చి మొండిగా ఉంటుంది. ఇంట్లో రవి, శృతిలను తీసుకు రావాలని అంటుంది. కానీ సత్యం, బాలు మాత్రం ఒప్పుకోరు. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో ప్రభావతి రవిని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. మొత్తానికి సత్యంను ఒప్పిస్తారు. సురేంద్ర తన ఇంటికి వచ్చి మాట్లాడుకునే విధానం తనకు నచ్చలేదని, అలాగే తను కావాలని జైలుకు పంపించాడని బాధపడతాడు సత్యం. ఈ సమయంలో తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని, ఓ తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలో? రవిని తీసుకువచ్చి తన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలో? తనకు అర్థం కావడం లేదని అంటాడు సత్యం. సురేంద్ర నన్ను ఎన్ని మాటలు అన్నాడు.. డబ్బులకోసం నా కూతురుకు వల విసురుతున్నా అని అన్నాడు. అతనే తన కూతురు, అల్లుడిని ఇంటికి పంపిస్తే నేను ఒప్పుకుంటాను అని అంటారు. ఎలాగోలా సగం లాక్కొంచాను కాస్త టైమ్ పడుతుంది అని ఆకలేస్తుంది. ఇక ప్రభావతి అన్నం పెట్టు మీనా ఆకలేస్తుంది అనేసి అడుగుతుంది. ఇక మీనా బాలుకి కాఫీ తీసుకొని వెళుతుంది. ఏంటి చీర కొంగు తో కాఫీ తెస్తున్నావ్ అంత మర్యాద అనేసి కాఫీ తీసుకుంటాడు కాఫీ కాలుతుంది. దాంతో మీనా వెటకారంగా మాట్లాడుతుంది. ఇక బాలు డబ్బులను సపరేట్గా పెడుతుంటాడు నేనా డబ్బులు ఎందుకు సపరేట్గా పెడుతున్నారని అడిగితే అప్పుల గురించి నీ చెప్తాడు. పిల్లల గురించి ఎప్పుడూ దాచిపెడతారు అని నేను అడుగుతుంది. అప్పులు తీరేంతవరకు కప్పు బెడ్ పైనే సాసర్ కిందే పడుకోవాలని బాలు కండిషన్ పెడతాడు.
ఇక ఉదయం కామాక్షి మాట్లాడుతూ ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది. ఇక పెళ్లిళ్ల పేరయ్య రావడం చూసి ప్రభావతి కామాక్షిలు రవి పెళ్లయిపోయింది కదా ఈ పేరయ్యను ఎప్పుడో రవికి గొప్పింటి సంబంధం తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడొచ్చి ఏం చెప్తాడో వాడికి పెళ్లి అయిపోయింది అని సంగతి తెలియదు అనుకుంటా అనేసి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు.. మాట్లాడొద్దు వదిన నేను మాట్లాడతాను అని పేరయ్యతో కామాక్షి మాట్లాడుతుంది. పేరయ్య తో తిక్క తిక్కగా కామాక్షి మాట్లాడితే పేరయ్య ఈవిడని కాసేపు గమ్మున ఉండమని చెప్పండి అమ్మ నేను చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయాలా ఉన్నాను అనేసి వెటకారంగా అంటాడు. పెడితే ఏం పని మీరు చెప్పండి పేరయ్య గారు అనేసి అడుగుతుంది ప్రభావతి. మీ అమ్మాయి మౌనికకు గొప్పింటి సంబందాన్ని తీసుకొచ్చాను. మీరు కలలో కూడా ఊహించి ఉండరు అంత మంచి సంబంధం అనేసి అంటారు. నీలకంఠంగారని ఈ ఊర్లో చాలా పెద్దమనిషి ఆయనకు ఒక్కడే కొడుకు ఈ అమ్మాయిని ఎక్కడో చూసాడంట చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు సూర్యాస్తమయం అయ్యే లోపల మీరు ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోవడం మంచిది అనగానే ప్రభావతి ఇంట్లో ఆయన కూడా లేరు అనేసి అంటుంది. మీరు ఉన్నారు కదా మీరు చూసుకోండి అమ్మ అనేసి పేరయ్యే చెప్తాడు. కామాక్షి ప్రభావతులు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్దామని మాట్లాడుకుంటారు..
ఇక సంజయ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు సంబంధం చూడమని చెప్పావా అనేసి అడుగుతుంది. ప్రతిరోజు వాళ్ళు సంజయ్ నన్ను ఘోరంగా అవమానించిన శృతి మీనా బాలు వీళ్ళందరికీ ఒకేసారి షాక్ ఇవ్వాలని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వీళ్ళందరికీ ఒక్కగానొక్క ఆడపడుచు అనేసి సంజయ్ అంటాడు. సంజయ్ కోసం నీలకంఠం సరే అంటాడు. ప్రభావతి, కామాక్షి ఇద్దరు నీలకంఠ మీ ఇంటికి వస్తారు.. ఇక నీలకంఠం వచ్చేసి మా అబ్బాయి మీ అమ్మాయిని చూశాడు అప్పటినుంచి పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చున్నాడు అందుకే నేను ఈ సంబంధాన్ని మా స్థాయికి తగ్గకపోయినా ఒప్పుకున్నాను అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..