trinayani serial today Episode: గాయత్రి పాప చేతిని తిలొత్తమ్మ చేతికి టచ్ చేస్తుంది నయని. దీంతో మంట వస్తుంది. తిలొత్తమ్మ భయపడుతుంది నన్ను తగులబెట్టాలనుకున్నారా..? ఏంటి అని కోప్పడుతుంది. మంట వచ్చిందేంటి అని ఇన్ స్పెక్టర్ అడగ్గానే ఇదే సాక్ష్యం అని విశాల్ చెప్తాడు. అవునని మా వదిన కన్నకూతురు గాయత్రిపాప కుడిచేత్తో మా అమ్మ కుడి చేత్తో తాకితే మంట పుడుతుంది అని విక్రాంత్ చెప్తాడు. ఇది నిజం ఈ నిజం మా నయని తనే అనడం అంతకంటే సత్యం అంటుంది దురందర.
నేను కూడా నమ్ముతున్నాను అంటాడు విక్రాంత్. మా ఫ్యామిలీకి తప్పా ఎవ్వరికీ తెలియని నిజం తనుక తెలిసింది అంటే తనే మా నయని వదిన అంటాడు విక్రాంత్. ఐ యామ్ సారీ వదిన మిమ్మల్ని అనుమానించినందుకు గిల్టీగా ఫీలవుతున్నాను అంటాడు. పర్వాలేదు విక్రాంత్ బాబు.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి అంటుంది. దీంతో ఇన్ స్పెక్టర్ ఇంకా తెలుసుకోవాలసింది ఉందనిపిస్తుంది అంటాడు. అవునని అప్పుడప్పుడు నయని, నేత్రిలా ఎందుకు మారిపోతుందో తెలుసుకోవాలి అంటాడు.
తర్వాత నయని చీర కట్టుకుంటుంటే విశాల్ వస్తాడు. నువ్వు చీర కట్టుకున్నావంటే నువ్వు నయనివే అంటాడు. నేను ఎప్పటికీ నీ నయనినే బాబుగారు అంటుంది. ఎప్పటికీ అనుకోవడం కన్నా ఎంత సేపటికి అనుకోవడం అలవాటు అయిపోయింది నయని అంటాడు. చూశావా గాయత్రి మీ నాన్న కూడా ఆయన మాటలతో నన్ను కలవరపెడుతున్నారు అంటుంది నయని. స్టేషన్‌ను నువ్వు వెళ్లిపోతున్నావని గాయత్రి పాప వచ్చి నిన్ను ఆపింది. దేవీపురంలో మనం ప్రాజెక్టు చేయడం ఏంటో కానీ నీకు ఆ ఊరికి ఏదో సంబంధం ఉంది అంటాడు విశాల్.
ఉంది బాబు గారు అని నేత్రి గురించి మనసులో అనుకుంటుంది నయని. ఇంతలో నేత్రి గురించి వెతుకుతున్న రత్నాంబ గురించి విశాల్ చెప్తాడు. నీ ఫోటో పట్టుకుని తన మనవరాలు నువ్వేనని వెతుకుతుందట అని చెప్తాడు. అయితే ఎంత వెతికినా దొరకదు కదా బాబుగారు అంటుంది నయని. ఎందుకు దొరకదు నువ్వే ఆమె మనవరాలిగా అక్కడకు వెళితే సరిపోతుంది కదా…? అంటాడు విశాల్. చాలా బాగా చెప్పారు బాబుగారు మనం అక్కడికి వెళ్దాం అంటుంది. మూడు గంటలు పూర్తి కావొస్తుందని నయని కంగారుగా పెన్ను కోసం వెతుకుతుంది. ఇంతలో విశాల్ పెన్ను తీసుకొచ్చి ఇస్తూ.. నీ మనసులో ఉన్నది కాదు నా మనసులో ఉన్నది రాయి అంటాడు. మూడు గంటల తర్వాత ఎందుకు మర్చిపోతావో అదే రాయి నయని అంటాడు.
నువ్వు నిజం రాస్తే నీ సమస్య నేను అర్థం చేసుకుని నీ పనేంటో పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాను రాయి నయని అంటాడు. ఎందుకలా చూస్తున్నావు నయని డైరీలో రాయి అని అడగ్గానే నేత్రి ఏం రాయాలి ఎందుకు రాయాలి అని ప్రశ్నిస్తుంది. మీరు పెన్ను ఇస్తూ రాయమంటే ఏం రాయాలో తెలియడం లేదు అంటుంది. విశాల్ షాక్ అవుతాడు. మూడు గంటల అయిపోయిందా..? అని ఆలోచిస్తుంటే.. ఏం మాట్లాడరేంటి బాబుగారు అని నేత్రి అడుగుతుంది. నీకు తోచిన కవితను నీకు వచ్చిన ముగ్గును ఏదో ఒకటి అందంగా రాస్తావని పెన్ను తీసుకోమన్నాను త్రినేత్రి అంటాడు విశాల్. మీరు నన్ను త్రినేత్రి అని పేరు పెట్టి పిలిచారు బాబుగారు అంటూ పెన్ను తీసుకుని బొమ్మ గీసి అందులో విశాల్ బాబుగారు లవ్ త్రినేత్రి అని రాసి వివాల్‌కు ఇచ్చి వెళ్తుంది.
హాల్లో అటూ ఇటూ తిరుగుతూ తిలొత్తమ్మ కోసం వల్లభ ఎదురుచూస్తుంటే గాయతరి పాప వస్తుంది. నేను మా మమ్మీ గురించి ఎదురుచూస్తుంటే.. మా బ్రో వాళ్ల మమ్మీ వస్తుందేంటి అంటాడు. ఇంతలో హాసిని, సుమన, విక్రాంత్ వస్తారు. మమ్మీ వెళ్లిపోయింది కదా అని విక్రాంత్ చెప్పగానే అప్పుడే పోయిందా..? అంటూ హాసిని సంతోషపడుతుంటే.. లేదని అమ్మ అఖండ స్వామి దగ్గరకు వెళ్లిందని వల్లభ చెప్తాడు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?