Bigg Boss 8 Telugu : వరల్డ్ టాప్ రియాలిటీ షో అంటే అందరికి గుర్తొచ్చే ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో ప్రస్తుతం తెలుగులో ఎనిమిదోవ సీజన్ జరుగుతుంది. మరో వారంలో ఈ షోకు శుభం కార్డు పడిపోతుంది. ఈ వారం నామినేషన్స్ లేకుండానే ఎలిమినేషన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. మరి ఈ వారం కేవలం ఓటింగ్ ద్వారానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఓటింగ్ ప్రకారం ఈ వారం ఇద్దరు బయటకు వెళ్తారని తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు ఎవరు అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ సీజన్ కు గెస్టుగా మెగా హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఆ మెగా గెస్ట్ ఎవరో ఒకసారి చూసేద్దాం..
వరల్డ్ టాప్ షో బిగ్ బాస్ కు తెలుగు ఆడియన్స్ నీరాజనం పడుతున్నారు. 100 రోజులు 16 మంది అని గ్రాండ్ గా మొదలైన ఈ షో మరికొద్ది రోజుల్లో ముగిగనుంది.. మరీ అంత కాకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే నడుస్తోంది. ఈ సారి ఎక్కువగా టీవీ యాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. హౌజ్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్ళాక ఇక హౌస్ లో కేవలం 5 మంది మాత్రమే ఉంటారు. వాళ్ళే ఫైనల్ కు వెళ్తారు. వారి లోంచి ఫిల్టర్ చేసి ఇద్దరు బయటకు వచ్చేస్తారు.. ముగ్గురిలో ఇద్దరిని స్టేజ్ మీదకు వస్తారు. వారిలో విన్నర్, రన్నర్ అని ప్రకటిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతున్నదే కదా కొత్తగా ఏముంది అనుకుంటున్నారు. కదా.. అయితే ప్రతి సీజన్ కు ఎవరొక హీరో గెస్టుగా రావడం ట్రోఫిని వారి చేతుల మీదుగా ఇస్తారు. కానీ ఈ సీజన్ కు గెస్టుగా మెగా హీరో రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో వచ్చిన చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రైజ్ మనీ ఇస్తున్నాడు. కానీ ఈ సారి మాత్రం పాన్ ఇండియా స్టార్ ను రంగంలోకి దించబోతున్నారంట. తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది కాబట్టి బిగ్ బాస్ కు క్రేజ్ పెంచేందుకు పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ను రంగంలోకి దించుతున్నారంట. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్లు చేశారు. మూవీపై మంచి హైప్ ఉంది. కాబట్టి రామ్ చరణ్ ను చీఫ్ గెస్ట్ గా రప్పిస్తే అటు మూవీ ప్రమోషన్, ఇటు బుల్లితేరపై క్రేజ్ కూడా పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆ హీరోతో చర్చలు జరుపుతున్నారంట. తండ్రి స్థానంలో రామ్ చరణ్ ఈ సారి వస్తే ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నారు.. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి రేపటికి ఈ విషయం పై క్లారిటీ రాబోతుందని టాక్..