Mohan Babu:ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగలలో సంక్రాంతి మొదటిది. ఈ పండుగ అంటే రైతులకు మహా ఇష్టం. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో భాగంగా మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటారు.. ఈ ఏడాది ఈరోజు అనగా జనవరి 13వ తేదీన భోగి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా సంబరంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేస్తున్నారు.ఇలాంటి అందాలు చూడాలి అంటే ముఖ్యంగా రెండు కళ్ళు చాలవు. పిండి వంటలు, చుట్టాలతో ప్రతి ఇల్లు కూడా ఎంతో సందడిగా ఉంటుంది. ఇక సెలబ్రిటీలు కూడా ఈ సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.
భోగి శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్ బాబు..
ప్రతి ఏడాది కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న మోహన్ బాబు (Mohan Babu)కూడా తన కుటుంబంతో కలిసి భోగిమంటలు వేశారు.ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులకు ,అభిమానులకు భోగి , సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మోహన్ బాబు. ఈ మేరకు ఒక పోస్టు కూడా చేయడం జరిగింది. “పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉంటూ.. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిద్దాం.. పాటిద్దాం.. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు. ప్రతి ఒక్కరు కూడా వారి మాటకు గౌరవం ఇస్తూ.. మన సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం.. ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి.. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. జరిగిన కాలాన్ని మర్చిపోండి. జరగబోయే కాలం గురించి ఆలోచన మొదలుపెట్టండి. ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి కరువు కాటకాలు ఉండకూడదని, రాకూడదని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. అంతేకాదు” జల్లికట్టు పోటీలలో పాల్గొనే యువకులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని” తెలిపారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సుప్రీంకోర్టులో ఊరట..
మోహన్ బాబు విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కుటుంబంలో ఆస్తి గొడవల కారణంగా కొడుకులిద్దరితో పాటు ఈయన కూడా వార్తల్లో నిలిచారు. ఇకపోతే తన ఇంటి వద్ద జరిగిన దాడిలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం వల్ల ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనితో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇకపోతే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలుమార్లు పోలీసులు చెప్పినా.. ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు కొట్టి వేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు నాలుగు వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ఊరట కలిగించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా భోగి పండుగ జరుపుకున్నారు.