trinayani serial today Episode: దేవీపురం ఆలయానికి విశాల్ వెళ్తుంటాడు. అదే ఆలయానికి నయని వస్తుంటుంది. మధ్యలో విశాల్ ఒక వ్యక్తిని ఆలయం గురించి అడిగితే అక్కడకు వెళ్లకపోవడమే బెటర్ అని చెప్తాడు. మరోవైపు విశాల్ ను మళ్లీ చూడాలని త్రినేత్రి బయటకు వెళ్తుంది. త్రినేత్రిని చంపమని కిరాయి రౌడీ రంగకు సుపారీ ఇస్తాడు ముక్కోటి.
విశాల్ నయనికి ఫోన్ చేసి నేను ముందే దేవీపురం రావడం మంచిదైంది అని ఆ గుడికి దగ్గరకు వెళ్లకపోవడమే బెటర్ అని చెప్పారు నేను ఇంటికి వచ్చాక అన్ని వివరాలు చెప్తాను అని విశాల్ చెప్పగానే లేదు బాబుగారు నేను దేవీపురం వచ్చేశాను. దగ్గరలోనే ఉన్నానని చెప్తుంది నయని దీంతో విశాల్ షాక్ అవుతాడు. నేను చెప్పాను కదా? వద్దని అంటాడు. దీంతో పదేపదే నాపైన విష ప్రయోగం జరుగుతుందని తెలుస్తుంది. అందుకే వచ్చానని చెప్తుంది నయని. దీంతో విశాల్ నువ్వు ఎంత అమాయకురాలివి అంటూ నువ్వు అక్కడే ఉండు నేనే వస్తాను అని విశాల్ చెప్పగానే సరే అంటుంది నయని.
మరోవైపు త్రినేత్రిని వెతుక్కుంటూ వాళ్ల బామ్మ ఊర్లో తిరుగుతుంది. చీర కట్టుకుని బయటకు వచ్చిందని మన ఊరోళ్ల కళ్లు మంచివి కావని దానికి దిష్టి తగులుతుందని ఇదిగో ఉప్పు, మిరపకాయ పట్టుకుని వెతుకుతున్నానని ఊర్లో వాళ్లకు చెప్తుంది బామ్మ. మరోవైపు విశాల్ కారు కోసం ఊరంతా వెతుకుతుంది త్రినేత్రి. మరోవైపు యమలోకంలో చిత్రగుప్తుడు బుక్కు తెరిచి ఈ రోజు చనిపోయే వారి పేరు త్రినేత్రి అనుకుంటూ ఆ పేరును కొట్టివేయాలని కంగారులో త్రినయని పేరు కొట్టి వేస్తాడు. తప్పును గ్రహించిన చిత్రగుప్తుడు భయపడుతుంటాడు. త్రినయని యమపురికి వస్తే నా పరిస్థితి ఏంటని భయపడుతుంటాడు.
ఊర్లో ఒక దగ్గర కారు ఆపుకుని విశాల్ కోసం చూస్తుంది నయని. విశాల్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఊర్లో ఉన్నానని నయని చెప్పగానే ఊరి సెంటర్ లోకి రమ్మని విశాల్ చెప్తాడు. సరేనని నయని ఫోన్ పెట్టేస్తుంది. ముక్కోటి ఇంటికి వెళ్లి ఇవాళ త్రినేత్రి రక్తం మన ఊరి నేలను తాకుతుందని ఆ రంగా గాడికి త్రినేత్రిని కారుతో గుద్ది చంపేయమని డబ్బులు ఇచ్చానని చెప్తాడు. దీంతో వైకుంఠం ముందు చంపేసిన తర్వాత సంబరాలు చేసుకో అంటుంది. దీంతో ముక్కోటి రంగాకు ఫోన్ చేసి ఇంకా కేక వినిపించలేదు అని అడుగుతాడు. ఇప్పుడే త్రినేత్రి కనబడింది. ఇంకాసేపట్లో వేస్తాను ఉండు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. నయనిని వెనక నుంచి వెళ్లి కారుతో గుద్ది వెళ్లిపోతాడు. దూరం నుంచి చూసిన విశాల్ ఏడుస్తూ కారు దిగి పరుగెత్తుకొస్తాడు. నయని అంటూ తన ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తుంటాడు. ఇంతలో నయని చనిపోతుంది.
మరోవైపు త్రినేత్రి కోసం వెతుకుతున్న బామ్మ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నీ మనవరాలికి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. దీంతో బామ్మ కిందపడిపోతుంది. ఇంతలో త్రినేత్రి పరుగెత్తుకొచ్చి బామ్మను లేపుతుంది. ఇంట్లో వల్లభ ఇంకా ఫోన్ రాలేదేంటి మమ్మీ అని తిలొత్తమ్మను అడుగుతాడు. నయనితో పాటు డ్రైవర్ కూడా చనిపోతే మనకు ఎవరు ఫోన్ చేస్తారురా..? అంటుంది తిలొత్తమ్మ ఇంతలో హాసిని వస్తుంది. హాసినిని చూసిన తిలొత్తమ్మ, వల్లభ సైలెంట్ అయిపోతారు. కన్ను పట్టుకున్న హాసినిని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది తిలొత్తమ్మ.
ఇందాకటి నుంచి కుడి కన్ను అదురుతుందని హాసిని చెప్పగానే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదరాలని కుడి కన్ను అదరకూడదు అంటుంది తిలొత్తమ్మ. ఈ విషయం వెంటనే చిన్న మరదలకు చెప్పాలి అని సుమనను పిలుస్తాడు. ఇంతలో సుమన వస్తుంది. ఏమైందని అడుగుతుంది. నువ్వు నిన్ను విక్రాంత్ కొడతాడు అంటావు.. కానీ హాసిని చూడు కన్ను ఎలా కొడుతుందో అంటూ చూపిస్తాడు. దీంతో సుమన నీకు ఏదో దుఃఖం రాబోతుంది అని చెప్తుంది. ఇంతలో విక్రాంత్ ఏడుస్తూ..వదిన అంటూ పరుగెత్తుకొస్తాడు.
కిందపడిపోయి వదిన అంటూ ఏడుస్తుంటాడు విక్రాంత్. హాసిని కూడా ఏడుస్తూ ఏమైందని అడుగుతాడు. నయని వదినకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే హాసిని ఏడుస్తుంది. ఇంతలో వల్లభ చచ్చిపోయిందా? అంటూ అడుగుతాడు. హాసిని కోపంగా ఏడుస్తూ వల్లభ గల్లా పట్టుకుని నా చెల్లికి ఏం కాదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో విక్రాంత్ ఏడుస్తూ.. సుమనను కొడుతూ దీని నోటితో కారు యాక్సిడెంట్ అని ఎలా అందో.. తెలియదు కానీ అలాగే జరిగింది అని విక్రాంత్ చెప్పగానే కారు బ్రేక్స్ ఫెయిల్ కాలేదా? అని వల్లభ అడుగుతాడు. విక్రాంత్ కాదు విశాల్ బ్రో చూస్తుండగానే ఏదో వెహికిల్ వచ్చి గుద్ది వెళ్లిందట అని చెప్తాడు. మరోవైపు నయనికి హాస్పిటల్ లో ఆపరేషన్ చేస్తుంటారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.