BigTV English

Bigg Boss 8 Telugu: అలా అనడం ఎందుకు? సారీ చెప్పడం ఎందుకు? నోటి దురుసు వల్ల విష్ణుకు ఎన్ని కష్టాలో!

Bigg Boss 8 Telugu: అలా అనడం ఎందుకు? సారీ చెప్పడం ఎందుకు? నోటి దురుసు వల్ల విష్ణుకు ఎన్ని కష్టాలో!

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయిన మొదట్లో విష్ణుప్రియాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ గానీ, నెగిటివ్ గానీ ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ హౌస్ నుండి వెళ్తున్న చాలావరకు కంటెస్టెంట్స్ తను అమాయకురాలు అనడంతో కొందరు ఆడియన్స్ కూడా తను అమయాకురాలే అని ఫిక్స్ అయిపోయారు. కానీ సీరియస్ సందర్భాల్లో నవ్వడం, ఎవరైనా ఏదైనా సీరియస్‌గా చెప్తే తీసుకోకపోవడం, సంబంధం లేకుండా మాట్లాడడం, తెలియకుండా మాటలు వదిలేయడం.. ఇవన్నీ తనకు నెగిటివ్‌గా మారాయి. తాజాగా తన నోటి దురుసుతనం వల్ల మరోసారి చిక్కుల్లో పడింది విష్ణుప్రియా. దాని వల్ల తను అందరికీ సారీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది.


వారిపై కామెంట్స్

మెగా చీఫ్ అవ్వగానే అవినాష్.. మిగతా కంటెస్టెంట్స్‌ను కూర్చొబెట్టి ఎవరికి ఏ డ్యూటీస్ కావాలని క్లియర్‌గా అడిగి తెలుసుకున్నాడు. అలా విష్ణుప్రియాను గిన్నెలు కడిగే సెక్షన్‌లో వేశాడు. కానీ తనకు గిన్నెలు కడగడం కష్టమవుతుందని, వంట సెక్షన్‌లో ఉన్నవారు తిప్పడం తప్పా ఏమీ చేయడం లేదని అవినాష్‌తో చెప్పింది. ఈ విషయాన్ని అవినాష్ వెళ్లి హరితేజకు చెప్పగా తను వంట సెక్షన్‌లో ఉన్న అందరితో పంచుకుంది. అయితే అవినాష్ ఈ మాటను అందరితో చెప్పేశాడని రోహిణి వచ్చి విష్ణుప్రియాకు చెప్పింది. అంతే కాకుండా ఇలా మాట్లాడడం వల్ల అందరూ హర్ట్ అయ్యారని కూడా చెప్పడంతో విష్ణుకు వేరే దారిలేక అందరికీ పేరుపేరునా వెళ్లి సారీ చెప్పింది.


Also Read: బయట ఒకరు.. ఇంట్లో మరొకరు.. ఏంటయ్యా ఈ లీలా..

డంబ్ అన్నాడు

వంట సెక్షన్‌లో ఉండేవారు కేవలం తిప్పుతారు అనే మాటను నిన్న చెప్పలేదు, మొన్న చెప్పాను అంటూ కవర్ చేసింది. ఎప్పుడూ చెప్తే ఏంటి చెప్పావు కదా అని రోహిణి కౌంటర్ ఇచ్చింది. తన తప్పు తెలుసుకున్న విష్ణు ముందుగా నిఖిల్, ఆపై టేస్టీ తేజ, హరితేజలకు కూడా సారీ చెప్పింది. అయితే తను ఇలా అంటుందని అస్సలు ఊహించలేదని, బాధపడ్డానని చెప్పుకొచ్చింది హరితేజ. దీంతో కాసేపు తనతో కూల్‌గా మాట్లాడి డీల్ చేసుకుంది విష్ణుప్రియా. ఆపై ఎప్పుడూ పృథ్వి జపం చేస్తూ ఉండే విష్ణుకు జ్ఞానోదయం అయ్యిందేమో అనిపించేలోపే మరోసారి తన చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. అనుకోకుండా విష్ణును డంబ్ అనేశాడు పృథ్వి. దీంతో తను హర్ట్ అయ్యింది.

మొహం పగలగొట్టాలనిపించింది

అసలు డంబ్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయానని విష్ణుప్రియాను పిలిచి సారీ చెప్పాడు పృథ్వి. ఒక్క సారీ చెప్పగానే తను కరిగిపోయి అక్కడే కూర్చొని తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా ఎలా డంబ్ అంటావు, నేను చెప్పాల్సింది చెప్పాను కదా అంటూ అసలు అక్కడ ఏం జరిగిందో గుర్తుచేసింది. డంబ్ అనగానే అప్పటికప్పుడు పృథ్వి మొహం పగలగొట్టాలి అనిపించిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అప్పుడు పృథ్వి ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ తను చేసిన పనికి, మాట్లాడిన మాటలకు తర్వాత తనే చాలా ఫీల్ అయ్యింది. అలా మళ్లీ తనే పృథ్వి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి, ఫ్రెండ్స్‌గా ఉందామంటూ మాటలు కలిపింది. పృథ్వి అంటే విష్ణుకు ఎందుకు ఇంత పిచ్చి అని ప్రేక్షకులు సైతం ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×