BigTV English

Trinayani Serial Today October 14th: ‘త్రినయని’ సీరియల్‌: పదేపదే ఆరిపోయిన  కర్పూరం – ఏదో చెడు జరగబోతుందన్న తిలొత్తమ్మ

Trinayani Serial Today October 14th: ‘త్రినయని’ సీరియల్‌: పదేపదే ఆరిపోయిన  కర్పూరం – ఏదో చెడు జరగబోతుందన్న తిలొత్తమ్మ

 trinayani serial today Episode: తిలొత్తమ్మ, వల్లభ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ విశాల్‌, నయని కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇంకా రాలేదని వల్లభ అడుగుతాడు. గజగండను చంపేశారు కదా? ఎలాగైనా వస్తారు అని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో హారతి తీసుకుని వచ్చిన హాసిని, నయని విశాల్‌ రావడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నయని, విశాల్‌ లోపలికి రాగానే చేతులకు రక్తం అంటుకోలేదని అడుగుతాడు వల్లభ. రక్తం ఏంటని విశాల్‌ అడగుతాడు. గజగండను చంపారు కదా చేతులకు రక్తం లేదని వాడు డౌట్ పడుతున్నాడని తిలొత్తమ్మ చెప్తుంది.


ఆ గజగండను చంపింది మేము కాదు ఆ అమ్మవారే త్రిశూలం తీసుకుని వచ్చి చంపారు అని చెప్తాడు విశాల్‌. తిలొత్తమ్మ షాకింగ్‌ గా అమ్మవారు వచ్చారా? అని అడుగుతుంది. అవునని నయని చెప్తుంది. ఇంతలో హాసిని దిష్టి తీయబోతుంటే హారతి పల్లెం కింద పడిపోతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. హాసిని సారీ చెప్తుంది. ఏదైనా కీడు జరుగుతుందంటారా? అని సుమన అడుగుతుంది. ఇంతలో దురందర ఇంకోసారి కర్పూరం బిల్లలు వెలిగించి దిష్టి తీయండని చెప్తుంది. హాసిని టెన్షన్‌ పడుతుంది.

రెండో సారి తిలొత్తమ్మ దిష్టి తీస్తుంది. అప్పుడు కూడా  కర్పూరం ఆరిపోతుంది. దీంతో వల్లభ గట్టిగా నవ్వుతాడు. హారతి ఆరిపోయిందేంటి అని అడుగుతాడు. ఇంతలో విక్రాంత్‌ నేను దిష్టి తీస్తానని హారతి పల్లెం తీసుకుంటాడు. కర్పూరం వెలిగించి దిష్టి తీస్తుంటే  మరోసారి హారతి ఆరిపోతుంది. దీంతో  అందరూ షాక్ అవుతారు. అందరూ ఏదేదో మాట్లాడుతుంటే వదిలేయండి అంటూ మీరు వెళ్లండి అని చెప్తాడు విక్రాంత్‌. నయని, విశాల్ లోపలికి వెళ్తారు.


నయని రెడీ అవుతుంటే లోపలికి వచ్చిన విశాల్‌ ఎన్నాళ్లయిందో నువ్వు ఇలా చీర కట్టి అంటాడు విశాల్‌. దీంతో ఏమన్నారు అంటూ అడుగుతుంది నయని. దీంతో నయనిని రొమాంటిక్‌ గా చూస్తూ దగ్గరకు వెళ్తుంటే నయని కింద పడబోతుంటే విశాల్‌ పట్టుకుంటాడు. హారతి పల్లెం పట్టుకోలేదు కానీ నిన్ను మాత్రం పట్టుకుంటాను అంటాడు విశాల్‌. ఎందుకు అలా జరిగిందో అని ఆలోచిస్తున్నా కానీ అంతు పట్టడం లేదు అంటుంది నయని.

ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అందరూ అన్నట్టుగా దిష్టి అనుకోవడమే కాకపోతే ఆ దిష్టి ఎలా పోగొట్టాలో చూడాలి అంటాడు విశాల్‌.  నాకు దిష్టి తగిలి జ్వరం వచ్చినా పర్వాలేదు కానీ మీకు మాత్రం ఒళ్లు కూడా వేడి కాకూడదు అంటుంది నయని.  ఇలాంటి చిన్నచిన్న  త్యాగాలు చేసే మీ ఆడవాళ్లు గొప్పవాళ్లు అనిపించుకుంటారు అనుకుంటా.. అంటాడు విశాల్‌.

వినడానికి అలా అనిపిస్తుంది. బాధ్యతలు మోస్తున్నప్పుడు.. గుండె బరువును అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాబుగారు అంటుంది నయని. దీంతో నేను సరదాగా అన్నాను కానీ నువ్వు సీరియస్‌ గా తీసుకుంటున్నావు అంటాడు విశాల్‌. మీరెలాగో నేను అలాగే ఉండాలి కదా? అంటుంది నయని. కానీ నువ్వు ఇంకా బాగుండాలి నయని అంటూ మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు విశాల్‌.

సుమన మేకప్‌ వేసుకుంటుంటే విక్రాంత్‌ వచ్చి .. నీకు మసి పూయడమే కాకుండా మేకప్‌ వేయడం కూడా వచ్చు అంటాడు. ఇప్పుడెందుక ఈ మాట నా గ్లామర్‌ చూసా..? అని ప్రశ్నిస్తుంది. దీంతో అలా అనుకున్నావా? నయని వదిన వాళ్లకు దిష్టి పెట్టింది నువ్వే అనిపిస్తుంది అంటాడు విక్రాంత్‌. నువ్వు మనసులో ఏమనుకున్నావో కానీ కర్పూరం వెలగనేలేదు అంటూ తిట్టడంతో సుమన, విక్రాంత్‌ ను తిడుతుంది. నేనేదో దిష్టి పెట్టానని మీరు కనిపెట్టినట్టు గొప్పలు పోతున్నారు అంటుంది. దీంతో వాళ్లు మంచి పని చేసి వచ్చారని  నీ నోట వెంట మాటవరసకు అయినా రాదా? అంటాడు. అవునా..? ప్రాణాలు తీసే పంచకమణిని, వెంటే ఉండే భుజంగమణిని తీసుకెళ్లి అమ్మవారిఇక అప్పజెప్పడం అంటే ఎంత అవివేకం. అట్టి పెట్టేసుకోవడానికి అవి మన సొత్తు కాదు అని చెప్తాడు విక్రాంత్‌. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

హాసిని అందరినీ పిలిచి రేపు పండుగ కదా? ఎవరికి ఏమేం కావాలో చెప్పండి అంటుంది. దీంతో అన్నీ తెస్తున్నారు కదా? హాస్‌ అంటుంది దురందర. నగో నట్రో అడిగితే తెచ్చిస్తారు కదా? పిన్ని అని చెప్తుంది సుమన. దీంతో విక్రాంత్‌ కోపంగా కొనుక్కోమని ఇవ్వరు. వదిన వాళ్లది ఎవరిదైనా ఇస్తారు. వేసుకుని మరుసటి రోజు ఇచ్చేయాలి అంటాడు. దీంతో లేకి బతుకు అయిపోయింది నాది అని గొణుగుతుంది సుమన.

ఇంతలో అక్కడికి వచ్చిన తిలొత్తమ్మ కాస్త గట్టిగా చెప్పు సుమన అంటుంది. నీ బాధ కూడా మాకు అర్థం అవ్వాలి కదా? అంటుంది. దీంతో అన్నింటికీ అడుక్కోవాలి కదా?  అత్తయ్యా అంటుంది సుమన. ఇంతలో మేము కూడా అడుక్కుంటున్నాము కదా? అంటాడు వల్లభ. ఇంతలో నయని వాటర్‌ తీసుకుని వచ్చి విశాల్‌ కు ఇస్తుంది. గ్లాస్‌ కిందపడిపోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

హరతి పల్లెం పడిపోయినట్టే గ్లాస్‌ పడిపోయిందేంటి అని మా అక్క ఆలోచిస్తుంది అంటుంది సుమన. ఇంట్లో వరుసగా జరుగుతున్న సంఘటనల గురించి అందరూ ఆలోచిస్తారు. ఏదో చెడు జరగబోతుందేమోనని తిలొత్తమ్మ అంటుంది. దీంలో అలాంటి విపత్తు జరగుతుందంటే నయని చెప్పకుండా ఉంటుందా? అని విశాల్‌ అంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. రెండో పెళ్లికి సత్యం రెడీ.. ఫ్రెండ్ ను కలిసిన బాలు..

Nindu Noorella Saavasam Serial Today october 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన అంజు  

Illu Illalu Pillalu Today Episode: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్ సక్సెస్‌ – కావ్యను కలవని డాక్టర్‌

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Big Stories

×