BigTV English

Trinayani Serial Today October 18th: ‘త్రినయని’ సీరియల్‌: గండం ఎవరివల్లనో తెలుసుకోవచ్చన్న విశాలాక్షి – ఇంట్లో హడావిడి చేసిన హాసిని  

Trinayani Serial Today October 18th: ‘త్రినయని’ సీరియల్‌: గండం ఎవరివల్లనో తెలుసుకోవచ్చన్న విశాలాక్షి – ఇంట్లో హడావిడి చేసిన హాసిని  

trinayani serial today Episode: అద్దంలో నయనికి ఇంకెవరో కనిపించి ఉంటారు అందుకే ఏడుస్తుంది అని తిలొత్తమ్మ అంటుంది. ఎవరో కనిపిస్తే ఎందుకు ఏడుస్తుంది అత్తయ్యా అంటూ సుమన అడుగుతుంది. ఏమో తెలియదు అని చెప్తుంది తిలొత్తమ్మ. విశాల్‌ మాత్రం విశాలాక్షిని ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అది నయని అమ్మకే తెలుసు అంటుంది విశాలాక్షి.  విశాల్ పైకి వెళ్లి ఏం జరిగిందని.. అద్దంలో ఎవరు కనిపించారని అడుగుతాడు. నేనే కనిపించానని నయని చెప్పి బాధపడుతుంది.


అద్దంలో నువ్వు కనిపిస్తే ఎందుకు బాధపడుతున్నావు. అయినా నీకు ప్రమాదం ఉంటే నీకు తెలియదు అని అంటాడు విశాల్‌. ఇంతలో అక్కడికి వచ్చిన విశాలాక్షి అదే నిజం అంటుంది. నిజం చెప్తుంది కానీ మనం ఏడుస్తుంటే తాను నవ్వుతుంది అంటుంది నయని. నాది నవ్వు ముఖం అమ్మా అంటూ చెప్తుంది విశాలాక్షి. దీంతో నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అద్దంలో నేను కట్టుకున్న చీర కాకుండా వేరే చీర కనబడిందేంటి అని నయని అడుగుతుంది. నువ్వు చీరను మాత్రమే చూస్తే అర్థం కాదమ్మా.. ఇంకా బాగా గమనిస్తే నువ్వు సమాధానం కోసం నన్ను ప్రశ్నించాల్సిన అవసరం రాదు అని చెప్పి వెళ్లిపోతుంది.

సుమన, విక్రాంత్‌ ను కళ్లలోకి చూస్తుంటుంది. ఏయ్‌ నన్ను ఇక్కడ ఎందుకు కూర్చోమన్నావు అని విసుగ్గా అడుగుతాడు. ఏం లేదు మా అక్క అద్దంలో ఏం చూసిందని అడుగుతుంది. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాడు అంటాడు విక్రాంత్‌. అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరూ చూడనిది తను చూసింది. అందుకే విశాల్‌ బావగారిని హగ్‌ చేసుకుని వెళ్లిపోయింది. అని సుమన చెప్పగానే విక్రాంత్‌ తిడుతూ నయని వదిన ఏడిస్తే నీకు ఆనంద బాష్పాలు వచ్చినట్టు కనిపించాయా..? అంటూ ప్రశ్నిస్తాడు విక్రాంత్‌. వదిన బాధకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నీ పాత్ర ఉందేమోనని డౌట్‌ గా ఉందంటాడు విక్రాంత్‌.


అదేం లేదు నేను కరెక్టుగానే ఉన్నాను ఈ మధ్య మా అక్కనే ఏదోలాగా ఉంది. భయపడ్డం ఏడ్వడం ఇవన్నీ చూస్తుంటే తన అధికార బాధ్యతలు అన్ని ఇంకొకరికి అప్పజెప్పే టైం వచ్చిందేమో అంటుంది. నువ్వు ఎక్కువ ఊహించుకోకు నయని వదిన రిలాక్స్‌ అవుతానంటే ఆ బాధ్యతలు హాసిని వదిన చూసుకుంటుంది. నువ్వు మాత్రం నీ అందం చూసుకుంటూ కూర్చో అంటాడు.

రూంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న తిలొత్తమ్మ దగ్గరకు వల్లభ వచ్చి విశాలాక్షి గురించి చెప్తుంటాడు. తనేం చేయలేదని పరమేశ్వరుడి మీద ప్రమాణం చేస్తాను అంటుంది కదా? అంటాడు దీంతో తెలుసు అని తిలొత్తమ్మ అంటుంది. నయనిని భయపెట్టింది విశాలాక్షి కాదు. తన దృష్టి అని చెప్పగానే అద్దంలో తను కాకుండా ఇంకెవరో కనిపించి ఉంటారా? మమ్మీ అని అడుగుతాడు. నా అంచనా ప్రకారం నయని తన చావు అంచును చూసి ఉండవచ్చు. ఇల్లాలు కంటతడి పెట్టుకుని భర్తను కౌగిలించుకుంది అంటే తను లేకుండా పోతుందని అర్థం.

నువ్వు లోతుగా కాకుండా చాలా దూరం ఆలోచికస్తున్నావు మమ్మీ అంటాడు వల్లభ. ఇందులో నా తెలివి ఏమీ లేదు వల్లభ. నయని ఇచ్చిన సూచనే నాకు క్లారిటీ ఇస్తుంది. ఎప్పుడూ రాని గండం తనకు ప్రమాదం ఉందని తనకు తానుగా తెలుసుకోవడం అది మనకు చెప్పడం ఇంకా పెద్ద ప్రమాదం వల్లభ. అయినా ఇప్పటిదాకా నువ్వు కామ్‌ గా ఉన్నావంటే ఏదో పెద్ద ప్లాన్‌ వేస్తున్నావనుకుంటున్నాను మమ్మీ అంటాడు వల్లభ.

హాసిని రాగానే ఇంట్లో జరిగిందంతా చెప్తాడు పావణమూర్తి. ఇంట్లో నేను ఒక్కరోజు లేకపోతే ఇంత జరిగిందా? అంటూ అదర్ని పిలుస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. విశాల్‌ ఏమైందని అడుగుతాడు. అందర్ని పిలవడానికి కారణం ఏంటని విక్రాంత్‌ అడుగుతాడు. దీంతో విశాలాక్షి ఎక్కడ అని అడుగుతుంది హాసిని. ఇక్కడే బుక్‌ చదువుతూ కింద కూర్చుంది చూడు అని పావణమూర్తి చెప్తాడు. నువ్వు కిందకు చూడవు కాబట్టే రెండోసారి నీళ్లు పోసుకోలేదమ్మా అంటాడు. నువ్వు చెప్పేది సిగ్గుపడటం గురించా బాబాయ్‌ అంటాడు విశాల్‌. అవునని అంటాడు పావణమూర్తి.

నా చెల్లెలు నయనిని యమపాశం వెంబడిస్తుందని ఎలా చెప్పావు అని హాసిని అడుగుతంది. విధి ఆడే వింత నాటకం పెద్దమ్మా అంటుంది విశాలాక్షి. చెల్లికి గండం ఏంటి? అని హాసిని ప్రశ్నిస్తుంది. దీంతో ఎందుకు రాకూడదా? తను అందరిలాగా మనిషి కాదా? అని ప్రశ్నిస్తుంది. దీంతో విశాల్‌ చిన్న పిల్ల ఏదో మాట్లాడితే మీరంతా ఎందుకు సీరియస్‌గా తీసుకుంటున్నారు అంటాడు. విక్రాంత్‌ మాత్రం అసలు నీకు ఏం కనిపించిందో చెప్పమని నయనిని అడుగుతాడు. నయని ఏడుస్తూ నాకు ప్రాణగండం ఉందని చెప్తుంది. ఇంతలో విశాలాక్షి ఎవరి వల్ల గండం వస్తుందో తెలుసుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

 

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×