BigTV English

Trinayani Serial Today October 5th: ‘త్రినయని’ సీరియల్‌: తిలొత్తమ్మ కొంగులో మణి దాచిన నయని – చాన్స్‌ మిస్‌ అయిందని బాధపడ్డ తిలొత్తమ్మ, వల్లభ  

Trinayani Serial Today October 5th: ‘త్రినయని’ సీరియల్‌: తిలొత్తమ్మ కొంగులో మణి దాచిన నయని – చాన్స్‌ మిస్‌ అయిందని బాధపడ్డ తిలొత్తమ్మ, వల్లభ  

 trinayani serial today Episode:  పూజ అయిపోయాక లలితమ్మ వెళ్లిపోతానంటుంది. దీంతో తిలొత్తమ్మ ఆగు అక్కా నువ్వు కొట్టేసిన భుజంగమణిని ఇక్కడ పెట్టేసి వెళ్లు అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అత్తయ్యా ఎవర్ని ఏమంటున్నారు మీరు అంటూ నయని అడుగుతుది. ఒకవేళ లేదంటే అని లలిత అడగ్గానే తిలొత్తమ్మ వెంటనే బయటకు  తియ్యారా అంటూ చెప్పగానే వల్లభ జేబులోంచి గన్‌ తీస్తాడు.


పెద్దమ్మను షూట్ చేసే గడ్స్‌ నాకు లేవు కానీ నువ్వే తీసుకో అమ్మా అంటాడు. దీంతో షూట్‌ చేయడానికి దీనిలో బుల్లెట్స్‌ ఉంటే సరిపోతుంది కదరా అంటూ గన్‌ తీసుకుని లలితమ్మకు  ఎయిమ్‌  చేస్తుంది. అమ్మా గాయత్రి పాప పెద్దమ్మ ఒడిలో ఉందని చెప్తాడు. నయని ముందుకు వెళ్తుంటే నువ్వాగు  నయని అంటూ కోపంగా చూస్తుంది తిలొత్తమ్మ.

అసలు నా మీద రివాల్వర్‌ ఎందుకు ఎక్కు పెట్టావో తెలుసుకోవచ్చా తిలొత్తమ్మ అంటూ లలితమ్మ అడుగుతుంది. దీంతో పెద్ద పెద్దమ్మ మళ్లీ అడుగుతుందేంటి మమ్మీ అంటాడు వల్లభ. పోయే ముందు క్లారిటీ తీసుకోవాలని అడుగుతుంది అంటుంది. ముందు  సమాధానం చెప్పు అంటుంది లలిత. భుజంగమణిని తీసుకుని ఇక్కడి నుంచి ఉడాయించాలనుకున్నందుకు నిన్ను కాల్చి పడేసైనా సరే ఆ మణిని ఈ ఇల్లు దాటనివ్వను అంటుంది.


శభాష్‌  నా దగ్గర మణి ఎక్కడ ఉంది అంటుంది లలిత. విశాల్‌ కూడా పెద్దమ్మ  దగ్గర మణి ఎందుకు ఉంటుంది అని అడుగుతాడు. ఇంతలో నయని భుజంగమణి తీసుకో అని చెప్పగానే నయని తిలొత్తమ్మ దగ్గరకు వెళ్తుంది. హాసిని మణి ఎక్కడుంది నయని అని అడుగుతుంది. తిలొత్తమ్మ అత్తయ్య  దగ్గర ఉంది అని నయని చెప్తుంది. శభాష్‌ ఇది ట్విస్ట్‌ అంటే అంటాడు  విక్రాంత్‌. నా దగ్గర మణి లేదు. నేను తీయలేదు అంటుంది తిలొత్తమ్మ.

నయని నీ దగ్గరే ఉందని చెప్తుంది కదమ్మా.. అంటాడు విశాల్‌. లలితమ్మ కూడా తిలొత్తమ్మ వద్దే ఉందని అంటుంది. దీంతో వల్లభ ఇదేదో రివర్స్‌ ప్లాన్‌ లా ఉందని అంటాడు. నయని నువ్వు అసలు నమ్మొద్దు అంటుంది తిలొత్తమ్మ. మీరు కదలకుండా అలాగే ఉంటే మణిని మీ దగ్గరే తీస్తాను అత్తయ్యా అంటూ తిలొత్తమ్మ కొంగులో ఉన్న మణిని తీస్తుంది నయని. నువ్వే ఎత్తేసి కొంగుకు  ముడేసుకున్నావా? మమ్మీ అంటాడు  వల్లభ.

తిలొత్తమ్మ వల్లభను తిడుతుంది. నా కొంగులో ఉన్నట్లు నాకే తెలియదు అంటుంది. మరి అక్కకు ఎలా తెలిసింది అని సుమన అడుగుతుంది. దీంతో నయనే, తిలొత్తమ్మ చీర కొంగుకు  కట్టిందని లలిత చెప్తుంది.  నయని నువ్వే మణిని అమ్మ చీర కొంగుకు కట్టావా? అని విశాల్ అడుగుతాడు. అవునని నయని చెప్తుంది. ఎప్పుడు కట్టావని వల్లభ అడగ్గానే చీర ఇచ్చేటప్పుడే మణిని కట్టానని చెప్తుంది నయని. దీంతో వల్లభ, తిలొత్తమ్మ షాక్‌ అవుతారు.

ఇంతలో విక్రాంత్‌ ఎందుకు వదిన అలా చేశారు. వాళ్ల చేతికి వెళితే తిరిగి ఇస్తారా? అనగానే అమ్మగారు  చెప్పారు నేను చేశాను అంటుంది నయని. అయితే మీరు రివాల్వర్‌ తెచ్చిపెట్టుకోవడంలో మీ ఉద్యేశం  ఏంటని అడుగుతాడు విక్రాంత్. తను ఆ పని చేసి మంచి పనే చేసిందని లలిత చెప్తుంది. దీంతో ఎందుకు  పెద్దమ్మా అని విశాల్ అడుగుతాడు.

గన్‌ నావైపు పెట్టినప్పుడు నా ఒడిలోనే గాయత్రి పాప ఉంది. అప్పుడు ప్రమాదం నాకొచ్చిందా? పాపకు వచ్చిందా? అని డౌట్ అంటూ నాకు ప్రమాదం వచ్చే విషయం కూడా నయని పసిగట్టలేదంటే ఈ గాయత్రి పాప శాస్త్రి గారి మనవరాలు  కానే కాదని అర్థం అని చెప్పి విశాల్‌కు పాపను  ఇచ్చి లలిత వెళ్లిపోతుంది.

వల్లభ, తిలొత్తమ్మ టెన్షన్‌ పడుతుంటారు. చీర కట్టుకో మమ్మీ అంటే  చూసి కట్టుకోవాలి కదా మమ్మీ అంటాడు వల్లభ. అంత మంచి అవకాశం మనకు మళ్లీ వస్తుందా? చెప్పు అంటాడు. అయితే జరిగిందేదో జరిగిపోయింది వల్లభ. ఇప్పటికే నేను చాలా అప్‌సెట్‌ అయ్యాను. ఇంకా నన్ను బాధపెట్టకు అంటుంది. పంచకమణికి ఉన్న శక్తికి మించి ఎక్కువ శక్తి ఆ భుజంగమణికి ఉందని తెలుసు. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేశావు అంటాడు.

మనకు కలిసొచ్చే కాలాన్ని చేజేతులారా జారవిడుచుకున్నాం అంటాడు. అయితే ఈసారి నయని మణి ఎక్కడ పెడుతుందో చూద్దాం. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు విశాల్ ఆలోచిస్తుంటే నయని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. కొత్త బ్రాంచి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు విశాల్‌. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Intinti Ramayanam Today Episode: బయటకొచ్చిన శ్రీకర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?

Nindu Noorella Saavasam Serial Today September 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు షాక్‌ ఇచ్చిన రణవీర్

GudiGantalu Today episode: పార్వతిని దారుణంగా అవమానించిన ప్రభావతి..మీనాకు రోహిణికి వార్నింగ్.. షీలా ఎంట్రీ..

Brahmamudi Serial Today September 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు నిజం చెప్పిన కావ్య – కోపంతో రగిలిపోయిన రాజ్‌

Illu Illalu Pillalu Today Episode: చెంబు కోసం శ్రీవల్లి ప్లాన్.. దొంగగా మారిన ధీరజ్.. ప్రేమకు కళ్యాణ్ షాక్..

Tv Serial Actress : టీవీ సీరియల్ యాక్టర్స్ భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?

Big Stories

×