BigTV English

Divorce Man Carry Wife: విడాకుల విచారణ జరుగుతుండగా.. భార్యను కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి ఏమైదంటే..

Divorce Man Carry Wife: విడాకుల విచారణ జరుగుతుండగా.. భార్యను కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి ఏమైదంటే..

Divorce Man Carry Wife| ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేసింది. అయితే కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. ఆ భర్త తన భార్య తన నుంచి విడిపోతుంది అనే తీర్పు వస్తుందనే భయంతో ఆమెను అందరూ చూస్తుండగా.. ఎత్తుకెళ్లిపోయాడు. సినిమాను తలపించే ఈ ఘటన చైనాలో జరిగింది.


ప్రముఖ చైనా వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం.. చైనాలోని సిచుయాన్ రాష్ట్రంలో నివసించే ‘లి’ అనే 44 వయసు గల వ్యక్తికి 20 ఏళ్ల క్రితం చెన్ అనే మహిళతో వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అంతా బాగానే జరుగుతున్న తరుణంలో 5 ఏళ్ల క్రితం లికి మద్యం తాగడం అలవాటైంది. ఇది తెలిసిన చెన్ అతడిని మద్యానికి దూరంగా ఉండాలని చెప్పేది. కానీ లి ఆమె మాటలు పట్టించుకునే వాడు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


అయితే ఈ కారణంగా వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో లి ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఇక ఈ గొడవలు రోజూ జరుగుతుండడంతో చెన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఏడాది క్రితం కోర్టులో విడాకుల కోసం కేసు వేసింది. కానీ కోర్టు ఆమెకు విడాకులు నిరాకరించింది.

అయినా చెన్ ఈ సంవత్సరం మరోసారి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. తన భర్త తనను రోజూ చితకబాదుతున్నాడని.. గృహ హింస నుంచి తనను కాపాడాలని న్యాయమూర్తిని విన్నవించుకుంది. దీంతో కోర్టు ఆమె విడాకుల పిటీషన్ విచారణకు స్వీకరించింది. సెప్టెంబర్ 2024లో విడాకుల కేసు విచారణకు వచ్చింది.

అయితే న్యాయమూర్తి ఈసారి ‘లి’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి అవకాశం ఇచ్చినా లి లో మార్పు రాలేదని అన్నారు. చెన్ కు స్వేచ్ఛగా, తన ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉందని చెప్పారు. ఇది విన్న ‘లి’.. ఇక న్యాయమూర్తి చెన్ కు విడాకులు మంజూరు చేసేస్తారని భయపడ్డాడు. తన భార్య తనను వదిలి వెళ్లిపోతుందని భావించి.. ఏం చేయాలో తోచక.. వెంటనే లేచి తన భార్యకు సమీపంగా వెళ్లి.. ఒక్కసారిగా ఆమెను తన భజాలపై ఎత్తుకుని కోర్టు బయటికి పారిపోయాడు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

ఇదంతా చూసి కోర్టులో ఉన్నవారంతా షాక్ అయిపోయారు. న్యాయమూర్తి ఆదేశించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, బెయిలిఫ్ లి వెంట పరుగెత్తి పట్టుకున్నారు. ఆ తరువాత మరోసారి విచారణ పున:ప్రారంభించారు. ఆ తరువాత న్యాయమూర్తి హెచ్చరించడంతో లి క్షమాపణలు చెప్పాడు. తన భార్యను వదిలి తాను ఉండలేనని, తనకు ఇంకో అవకాశం ఇవ్వాలని కోరాడు. తాను భావోద్వేగానికి లోనై నిండు కోర్టులో అందరి ముందు తన భార్యను ఎత్తుకెళ్లిపోవడం తప్పేనని అంగీకరించాడు. ఇకపై తాను ఇలా ఎప్పుడూ ప్రవర్తించనని రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపాడు. తన భర్త ఆవేదన చూసి చెన్ తన విడాకుల కేసుని ఉపసంహరించుకుంది.

చైనా మహిళల ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం.. చైనాలో 30 శాతం వివాహం జరిగిన మహిళలు గృహ హింసకు గురయ్యారని, పైగా 60 శాతం వివాహితల ఆత్మహత్యలు గృహ హింసే కారణం. అయితే సోషల్ మీడియాలో లి, చెన్ ల విడాకుల కోర్టు సీన్ గురించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

దీనిపై ఒక యూజర్ కామెంట్ చూస్తూ.. ”ప్రజలందరూ చూస్తుండగా.. కోర్టు రూమ్ లో అతను ఎత్తుకొని వెళ్లిపోయాడంటే.. ఎవరూ లేని సమయంలో అతను ఏం చేస్తాడో?..” అని రాశాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కోర్టు అతనికి మరో అవకాశం ఎలా ఇస్తుంది?.. అతను ఆమెను ఒకరోజు చిత్రహింసలు పెట్టి చంపేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని కామెంట్ చేశాడు.

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×