BigTV English

Bigg Boss 8 Day 35 Promo 1: వైల్డ్ కార్డు ఎంట్రీస్ తోనే కాదు సెలబ్రిటీస్ తో కూడా సందడి చేయనున్న నాగ్..!

Bigg Boss 8 Day 35 Promo 1: వైల్డ్ కార్డు ఎంట్రీస్ తోనే కాదు సెలబ్రిటీస్ తో కూడా సందడి చేయనున్న నాగ్..!

Bigg Boss 8 Day 35 Promo 1.. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ కు రెట్టింపు స్థాయిలో వినోదం పంచడానికి బిగ్ బాస్ (Bigg Boss) మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో మాజీ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి దింపబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఈవెంట్ లాంచ్ 2.0 పేరిట మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టబోతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక చిన్న ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈరోజు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్స్ అడుగుపెట్టడమే కాకుండా ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు కూడా కంటెస్టెంట్స్ ను అలరించడానికి సిద్ధం అయిపోయారు. మరి ఈ ప్రోమో గురించి ఇప్పుడు చూద్దాం..


వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో పాటు సెలబ్రిటీస్ కూడా..

తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లోకి.. మహబూబ్, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, రోహిణి , ముక్కు అవినాష్ ఇలా మొత్తంగా ఎనిమిది మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు వీరంతా కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రాబోతున్నారని తెలిసి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా షో కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు జరగబోయే ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 8 లో భారీ టిఆర్పి రేటింగ్స్ సాధించబోతుందని అంచనాలు కూడా నిర్వాహకులలో మొదలయ్యాయి.


అడ్డుకట్ట వేయడానికి సిద్ధమైన కంటెస్టెంట్స్..

ఇకపోతే హౌస్ లోకి రాబోయే వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి అడ్డుకట్ట వేయడానికి కంటెస్టెంట్ అప్పుడే కస్తరత్తులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రోమో మొదలవగానే వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాబోతున్నాయని నాగార్జున చెప్పగానే.. విష్ణు ప్రియా మాట్లాడుతూ.. వైల్డ్ కార్డ్స్ అతిథిదేవోభవ రండి మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి , మెల్లమెల్లగా మిమ్మల్ని బయటకు పంపిస్తాము అంటూ చెబుతుంది. మొత్తానికైతే వైల్డ్ కార్డ్స్ తో గట్టిగానే పోరాడడానికి సిద్ధమవుతున్నారు కంటెస్టెంట్స్..

సందడి చేసిన సెలబ్రిటీస్..

ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో గ్రాండ్ ఈవెంట్ ప్రారంభించిన సందర్భంగా సెలబ్రిటీలు కూడా తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లో సందడి చేశారు. స్వాగ్ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం శ్రీ విష్ణు, రీతు చౌదరి తదితరులు హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరితోపాటు సుహాస్, నిర్మాత దిల్ రాజు, షాయాజీ సిండే , సుధీర్ బాబు తదితరులు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ముద్దు ముద్దు మాటలతో హరితేజ కూతురు కూడా స్టేజ్ పై కనిపించి తన అమ్మను రోజు టీవీలో చూస్తానంటూ చెప్పింది. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×