BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు రక్షను ఇచ్చిన మనోహరి – మిస్సమ్మకు నిజం చెప్పిన రాథోడ్‌

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు రక్షను ఇచ్చిన మనోహరి – మిస్సమ్మకు నిజం చెప్పిన రాథోడ్‌

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరితో  పర్సనల్‌ గా మట్లాడాలి లోపలి రమ్మని అమర్‌ పిలవగానే మనోహరి భయంగా లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ అంత పర్సనల్‌ ఏంటబ్బా అని మనసులో అనుకుంటుంది. టెర్రస్‌ మీదకు వెళ్లిన అమర్‌ను వెనకాలే వెళ్లిన మనోహరి ఏంటి అమర్‌ ఏదో ముఖ్య విషయం అన్నారు అని అడుగుతుంది. అవును మనోహరి ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అమర్‌ అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది. మెల్లగా తేరుకుని చెప్పాను కదా అమర్‌. ఫ్రెండ్స్‌ తో కెఫేకు వెళ్లాను అని అంటుంది. దీంతో కెఫే ఏ ఏరియాలో ఉందని కెఫేకు కారులోనే వెళ్లావా? అంటూ అమర్‌ ఆరా తీయడంతో జూబ్లీహిల్స్ లో ఉందని కారులోనే వెళ్లానని మనోహరి చెప్తుంది. దీంతో మరి నేను నీ కారును నానక్‌రాంగూడ ఏరియలో చూశానని అమర్‌ చెప్పగానే మనోహరికి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అంటే అప్పుడు  అక్కడకు వచ్చింది అమరా..? నేను ఘోరాతో మాట్లాడటం చూశాడా ఏంటి?  అని మనసులో అనకుంటూ భయపడుంది.


ఇంతలో అమర్‌..  మనోహరి నువ్వు జాబ్లీహిల్స్ లో నీ ఫ్రెండ్స్‌ తో ఉంటే ఆదే టైంలో నీ కారు నానక్‌రాంగూడలో ఎలా ఉంటుంది. అని అమర్‌ అడగగానే మనోహరి అది అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. దీంతో అమర్‌.. నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు మనోహరి.  నాకు కావాల్సింది నీ మౌనం కాదు నీ సమాధానం అంటూ అమర్‌ నిలదీయడంతో.. నాకు ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందని అందుకే అక్కడ ఇల్లు చూద్దామని వెళ్లాను. ఇదే విషయం నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు అంటుంది మనోహరి. నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే వేరేగా ఉండు కానీ సిటీకి అందదూరం ఎందుకు ఇక్కడే దగ్గర్లో మంచి ఇల్లు చూడమని రాథోడ్‌ కు చెప్తాను అని అమర్‌ వెళ్లిపోతాడు.

వీళ్లేటి ఇంకా రాలేదు  అంత సీరియస్‌ గా ఏం మాట్లాడతున్నారు అని మిస్సమ్మ మనసులో అనుకుని బయటకు వెళ్లి రాథోడ్‌ ను ఏం జరిగిందని అడుగుతుంది. ఇంతలో బయటి నుంచి వచ్చిన ఆరు చెట్టు చాటుగా వెళ్లి రాథోడ్‌, ఆరులను గమనిస్తుంది. మేము ఉదయం మనోహరికి ఫోన్‌ చేస్తే తాను జూబ్లీహిల్స్‌ లో ఉన్నానని అబద్దం చెప్పిందని తన కారు నానక్‌రాంగూడలో ఉన్నదని చెప్తాడు రాథోడ్‌. అవునా మనోహరికి అబద్దం చెప్పాల్సిన అవసరం ఏమోచ్చింది అని మిస్సమ్మ అడుగుతుంది. రాథోడ్‌ ఏమోనని అంటాడు. వీళ్ల మాటలు విన్న ఆరు ఇక మనోహరిని వదిలిపెట్టకూడదని వచ్చే పౌర్ణమికి మనోహరిని ఇంట్లోంచి తరిమేయాలని అనుకుంటుంది.


మరోవైపు పిల్లలందరూ స్కూల్‌  కు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. ఇంతలో మనోహరి కింద నుంచి అంజును పిలుస్తుంది. కిందకు వెల్లిన అంజు ఏంటి అంటీ పిలిచారు అని అడుతుంది. అంజును ముద్దు పెట్టుకున్న మనోహరి.. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది తెలుసా..? సేమ్‌ టూ సేమ్‌ అంటుంది. దీంతో ఏం మీకు చిన్నప్పటి నుంచి చదువు రాదా. మీరు కూడా నాలాగా ఓవర్‌ గా బిహేవ్‌ చేసేవారా? అల్లరి చేసి అందరితో తిట్లు తినేవారా.? చెప్పండి అంటుంది.

అంజు మాటలకు షాక్‌ అయిన మనోహరి నేను చెప్తుంది. నీలాగా క్యూట్‌గా ఇంటలిజెంట్‌ గా ఉండేదాన్ని అంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ముచ్చటగా ఉంది తెలుసా? అనగానే మరి మీరు కూడా పెళ్లి చేసుకుని ఉంటే నాలాగా ముద్దుగా క్యూట్‌ గా ఉన్న ఒక కూతురు పుట్టేది కదా..? అప్పుడు తనను కూడా మీరు  ఇలానే ముద్దు చేస్తూ స్కూల్‌ కు రెడీ చేస్తూ పంపించేవారు కదా?  అంటుంది అంజు. దీంతో మనోహరికి తాను దుర్గను వదిలేసిన విషయం గుర్తుకువస్తుంది. ఆ జీవితం వద్దనే కదా వదిలేసి వచ్చాను. అని మనసులో అనుకున్న మనోహరి.. అది  సరే నాకు ఒక హెల్ఫ్ కావాలి చేస్తావా.. అంజు అని అడుగుతుంది.

ఆ చేస్తాను చెప్పండి ఆంటీ ఏం హెల్ఫో.. అంటూ అంజు చెప్పగానే. ఘోర ఇచ్చిన రక్ష ను అంజుకు ఇచ్చి ఇది ఎవ్వరికీ చెప్పొద్దని రేపు నేను నీ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాక ఈ రక్షను నా చేతికి కట్టాలని చెప్తుంది. దీంతో రేపు ఎందుక ఇవాలే మీరే కట్టుకోవచ్చు కదా? అంటూ అంజు ప్రశ్నించడంతో అది కాదు అంజు అందరి కన్నా నువ్వు చాలా క్లెవర్‌ కదా? అందుకే నీకీ టాస్క్‌ ఇస్తున్నాను అంటుంది మనోహరి. ఆ మాటలకు అంజు సరేనని చెప్పి రక్ష తీసుకుని వెళ్లిపోతుంది. పైన పిల్లలు మనోహరి ఆంటీ నిన్ను ఎందుక పిలిచింది అని అడుగుతే ఇంటలిజెంట్స్‌ నే ఎవరైనా పిలుస్తారు అంటూ బిల్డప్‌ కొడుతుంది. అంజు.

జైలు నుంచి తప్పించుకున్న అరవింద్‌ లోకేషన్‌ తెలుసుకుని అక్కడ రైడ్‌ చేశామని అరవింద్‌ తప్పించుకున్నాడని వాడి మనిషొకడు దొరికాడని చెప్తాడు. అరవింద్‌ దొరకడం కష్టంగా మారిందని కానీ ఎలాగైనా వాణ్ని పట్టుకోవాలని చెప్పగానే అమర్‌ తనతో ఒక ఐడియా ఉందని అలా అయితేనే వాణ్ని ఈజీగా పట్టుకుంటామని లేదంటే వాడిప్పుడు అలర్డ్‌ అవుతాడని వాడి కోసం వెతకాల్సిన పని ఉంటుందని నా ఐడియా ఫాలో అయితే వాడే బయటకు వస్తాడని అమర్‌ చెప్తాడు. ఆ ఐడియా ఏంటో చెప్పమని ఆఫీసర్‌ అడగగానే.. సెక్యూరిటీ లేకుండా నేను నా భార్యతో కలిసి బయటకు వస్తానని అప్పుడు వాడు నన్ను ఏదైనా చేయడానికి వస్తాడని ఆ టైంలో వాణ్ని పట్టుకోవచ్చని అమర్‌ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×