BigTV English

Trinayani Serial Today September 25th: ‘త్రినయని’ సీరియల్‌: అడవితల్లిని దర్శించుకున్న నయని – గుడికి దారి చూపెట్టిన అడవితల్లి

Trinayani Serial Today September 25th: ‘త్రినయని’ సీరియల్‌: అడవితల్లిని దర్శించుకున్న నయని – గుడికి దారి చూపెట్టిన అడవితల్లి

 


trinayani serial today Episode:  కామసాని గురించి తాళపత్రాలలో ఉన్న విషయం గుర్తు చేసుకుంటుంది నయని. నాకు కనిపించిన ఆ అవ్వ మీ పూర్వికురాలు బాబు గారు అంటూ ఆశ్చర్యంగా చెప్తుంది నయని. ఏంతో పుణ్యం చేసుకుంటే తప్పా ఆమె దర్శనం కాదు అంటూ పదండి బాబుగారు త్వరగా వెళదాం అంటూ పడమర వైపు వెళ్తుంటారు. విశాల్‌ బాగా అలసిపోయి నడుస్తుంటాడు. రాయి తగలడంతో కిందపడిపోతాడు. అయ్యో మిమ్మల్ని నా వెంట తీసికొచ్చి తప్పు చేశానేమో అంటుంది నయని. నేను ఇక నడవలేను నయని అంటాడు.

ఇంతలో అక్కడకు శివ వస్తుంది. ఇద్దరిని పిలుస్తుంది. దీంతో ఇద్దరూ శివ నువ్వెందుకు వచ్చావు ఇటు అని అడగుతారు. మణికాంతగిరిని చూడాలని నాకు కూడా కోరిక పుట్టింది కదా? అందుకే వచ్చాను అంటుంది. వద్దు శివ ఇంకెప్పుడు అలాంటి కోరిక కోరకు దారి తెలియడం లేదు. అంటాడు విశాల్‌. దీంతో శివ మీరు సరిగ్గానే వచ్చారని అడవి తల్లి మీకు ఇంకో వంద అడుగుల దూరంలోనే ఉంది అని చెప్పగానే ఉత్సహంగా విశాల్‌ లేచి నడుస్తాడు. మరోవైపు గజగండ అడవిలో వెతుక్కుంటూ  విశాల్ వదిలేసిన షూస్ చూస్తాడు.


దురందర పూజ చేసి హారతి తీసుకుని వస్తుంది. తన భర్త కోవెల మూర్తికి ఇస్తుంది. ఇప్పుడే ప్రసాదం పెట్టావు మళ్లీ హారతి అంటున్నావేంటి అని అడుగుతాడు. ఇంతలో అందరూ వస్తారు. వల్లేమైన దురదగా ఉందా? అత్తయ్యా అని వల్లభ అడుగుతాడు. తిలొత్తమ్మ కూడా మళ్లీ చీర మార్చావేంటి? అని అడుగుతుంది. తల స్నానం చేసి దేవుడికి పూజ చేశాను వదిన అంటుంది. సమయం సందర్భం ఉండాలి కదా పిన్ని అంటుంది సుమన. ఎందుకు లేదు సుమి నయని వాళ్లు భుజంగమణి తీసుకురావడానికి వెళ్లారు కదా? అంటుంది దురందర.

వాళ్లు వెళ్లడానికి నువ్వు పూజ చేయడానికి ఏంటి సంబంధం అత్తయ్యా.. అని అడుగుతాడు విక్రాంత్‌. వాళ్లు మణికోసం వెళ్లారు కదా? ఏ ఆటంకం రాకూడదని చేశాను అంటుంది. ఇంతలో హాసిని పిన్ని నేను పూజ చేసే వాళ్లను పంపించాను కదా? అంటుంది. ఇంతలో తిలొత్తమ్మ అది భక్తి కాదు హాసిని భయం అంటుంది. దురందర హైట్‌ ఉంది కానీ గుండె వెయిట్‌ తక్కు వ ఉంది. ఎటు వెళ్లారు. ఏమైపోయారు అని భయపడేవాళ్లు ఇలా సడెన్‌ గా పూజలు చేస్తుంటారు అని చెప్తుంది.

అడవితల్లి గుడికి చేరుకుంటారు నయని, విశాల్‌. శివ అక్కడికి వచ్చి ఇదిగో అడవితల్లి మీ  రాక కోసమే ఎదరుచూస్తుంది. అమ్మా మా కోసమే ఈ అడవిలో కొలువై ఉన్నావు అనిపిస్తుంది అంటుంది నయని. జన సంచారం లేని ఇక్కడ నీకు పూజలు ఎవరు చేస్తారని ఇక్కడ ఉన్నావు తల్లి అంటాడు విశాల్‌. ఈ కొండ దిగువన ఉండే గూడెం వాళ్లు ప్రతి శుక్రవారం వచ్చి ఆ తల్లికి నైవేద్యం పెడతారట అని శివ చెప్తాడు. ఇంతలో విశాల్‌.. ఆ అడవి తల్లికి బొట్టు పెట్టు అని చెప్తాడు. దీంతో నయని అమ్మవారికి బొట్టు పెడుతుంది. అమ్మా మేము మణికాంతగిరి వెళ్లాలి. దారి తెలియక అవస్థ పడుతున్నాం. నా భర్త కూడా నాతో వచ్చారు. కాలికి దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము ఆ మనసాదేవి ఆలయానికి ఎలా వెళ్లాలి. నీ మీదే భారం వేస్తు్న్నాం తల్లి అని మొక్కుతుంది నయని.

ఇంతలో గాలికి రెండు బుట్టలు కొట్టకుని వస్తాయి. ఆ రెండు బుట్టలను కావడి లాగా కట్టుకుని విశాల్‌, గాయత్రి పాపలను అందులో కూర్చోబెట్టుకుని నయని ఎత్తుకుని వెళ్తుంది.  ఇంతలో అమ్మవారి నుదుటి నుంచి ఒక వెలుతురు వస్తుంది. వెలుతురు పడ్డ చోట తవ్వితే అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని కావడిలో పెట్టుకుని నయని వెళ్తుంటే అమ్మవారి నుదుటి నుంచి మరోవ వెలుతురు పడుతుంది. దీంతో అమ్మవారు మనకు ఆ వెలుతురు ద్వారా మణికాంత గిరికి దారి చూపిస్తున్నారని వెళ్తారు. నయని వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికి అమ్మవారి గుడి దగ్గరకు గజగండ వస్తాడు. కాంతి మార్గం ఏర్పడిందంటే మణికాంతగిరి దారి ఏర్పడినట్టే అనుకుని వెళ్తాడు.

విక్రాంత్‌ పౌర్ణమి చంద్రుణ్ని చూస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఇంతలో సుమన వచ్చి భోజనం చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.  దీంతో విక్రాంత్‌ నీ తొడబుట్టిన అక్క అడవిలోకి వెళితే నీకు ఏమీ అనిపించడం లేదా? అని అడుగుతాడు. మా అక్క వేరే ఎవరితోనో వెళ్లి పోయిందంటే ఆలోచించాలి అంతేకానీ మా అక్క తను కట్టుకున్న వ్యక్తితోనే వెళ్లింది కదా? అంటుంది. దీంతో విక్రాంత్‌ కోపంగా సుమనను చూస్తుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×