E-Paper
Advertisement

ఆ సీరియల్ సెకండ్ లైఫ్ ఇచ్చింది..గుండె నిండా గుడి గంటలు రోహిణి !

ఆ సీరియల్ సెకండ్ లైఫ్ ఇచ్చింది..గుండె నిండా గుడి గంటలు రోహిణి !
Advertisement

Gundeninda Gudigantalu Rohini: బుల్లితెరపై ఎంతో అద్భుతమైన రేటింగ్ తో దూసుకుపోతూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సీరియల్స్ లో గుండె నిండా గుడిగంటలు (Gundeninda Gudigantalu) సీరియల్ ఒకటి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని ఆడ మగ అని తేడా లేకుండా ఈ సీరియల్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ సీరియల్ లో రోహిణి పాత్రలో నటిస్తున్న జ్యోతిక మునిరత్నం(Jyothika Muniratnam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిణి పాత్ర ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకున్న జ్యోతిక ఇదివరకే పలు తెలుగు సీరియల్స్ లో నటించారు కానీ గుండె నిండా గుడి గంటలు అంతా గుర్తింపు మాత్రం ఏ సీరియల్ తీసుకురాలేదని చెప్పాలి.

గుండె నిండా గుడిగంటలు రెండో లైఫ్ ఇచ్చింది..

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి జ్యోతిక మునిరత్నం సీరియల్స్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. తాను తెలుగులో ప్రేమ ఎంత మధురం గోరింటాకు వంటి సీరియల్స్ లో చేశాను అయితే ఉన్నఫలంగా ప్రేమ ఎంత మధురం ఆగిపోయిందని తద్వారా తన కెరియర్ ఎటూ కాకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను దాదాపు మూడు సంవత్సరాల పాటు విరామం ఇచ్చానని అయితే ఆ సమయంలోనే తనకు గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో అవకాశం వచ్చిందని తెలిపారు. ఇలా గుండె నిండా గుడిగంటలు సీరియల్ నాకు రెండో లైఫ్ ఇచ్చిందని ఈమె తెలిపారు.

నిజం ఎక్కువ రోజులు దాగదు..

Advertisement

ఈ సీరియల్లో నా పాత్రను అభిమానించేవారు కంటే కూడా నేను దొరికిపోవాలి అని ఎదురుచూసే వారే ఎక్కువ మంది ఉన్నారంటూ ఈమె సరదాగా మాట్లాడారు. ఇక ఈ సీరియల్ ప్రతి ఒక్కరి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అలాగే పార్లరమ్మ, డబ్బుడమ్మ, లక్షల మింగినోడు అనే పేర్లు చాలా వెరైటీగా ఉంటాయని ఈమె తెలిపారు. మరి మీకు కొడుకు ఉన్నాడని ఈ సీరియల్ లో ఎప్పుడు రివీల్ అవుతుంది అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్న వేశారు. అబద్ధం ఎప్పుడు తాగదు, నిజం ఏదో ఒక రోజు బయటపడుతుందనే కాన్సెప్ట్ తోనే ఈ సీరియల్ ఉందని ఖచ్చితంగా ఆ విషయం కూడా తెలిసిపోతుందని రోహిణి తెలిపారు.

సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్..

ఈ సీరియల్ కంటే ముందుగా తాను ఎలాంటి ప్రాజెక్ట్స్ లేక ఇంటిపట్టునే ఉండిపోవడంతో బాగా శరీర బరువు పెరిగిపోయానని జ్యోతిక తెలిపారు. అందుకే తాను పెద్ద ఎత్తున వర్కెట్స్ చేస్తూ హెల్త్ పై ఫోకస్ చేశానని ఈమె తెలియజేశారు. ఇక సీరియల్లో చాలా పద్ధతిగా కనిపించే జ్యోతిక ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు. ఇక ఈమె ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు..

Advertisement

Also Read: లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!

Related News

శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!

లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్

అషు రెడ్డి గ్లామర్ షో.. . సోషల్ మీడియాలో కిర్రాక్ రెస్పాన్స్!

పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఝాన్సీ అప్లై చేస్తోందా.. చరణ్ మాటలకు అర్థం?

Nuvvu leka Nenu lenu Radha : రాధ ఆస్తుల విలువ.. త్వరలోనే పెళ్లి..?

Podarillu serial : మాధవ్ కు దిమ్మతిరిగే షాక్.. మనీష అవుట్..

Big Stories

Advertisement
×