E-Paper
Advertisement

ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే.. విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !

ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే..  విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !
Advertisement

Vishal Bhardwaj:సినిమాల్లోని రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించడం ఒకరకంగా కట్టి మీద సామే.అందులో యాక్టర్స్ ఎంతవరకు ఇంటిమేట్ అవ్వాలో డైరెక్టర్ కి క్లారిటీ ఉంటె ఒకే,లేదంటే సీన్స్ కాస్తా తలా తోకా లేకుండా ఎబ్బెట్టుగా మారిపోవడం పక్కా.అయితే ఇపుడు ఈ సీన్స్ కోసం స్పెషల్ గా ఇంటిమసీ డైరెక్టర్స్ రావడంతో ఇలాంటి సీన్స్ ని తీసే
విధానమే మారిపోయిందని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ విశాల్ భరద్వాజ్.

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘Lust Stories 3’

Advertisement

విషయంలోకి వస్తే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘Lust Stories 3’లో ఒక కథను తెరకెక్కించిన విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ తాజాగా డివైడ్ టాక్ తెచ్చుకుంది కూడా.ఇక డిజిటల్ లో ఈ అంతాలజీ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు విశాల్ భరద్వాజ్. ఇంటిమేట్ సీన్స్ షూటింగ్ సమయంలో సెట్స్‌లో ఉండే అసౌకర్యాన్ని ఇంటిమసీ డైరెక్టర్స్ చాలా వరకు తగ్గిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇలాంటి సన్నివేశాల విషయంలో

Advertisement

వాళ్లు ఉండటం వల్ల దర్శకుడు, నటీనటులు అందరూ మరింత సౌకర్యంగా, ప్రొఫెషనల్‌గా పని చేయగలుగుతున్నారని తెలిపాడు.గతంలో ఇలాంటి సన్నివేశాల విషయంలో నటీనటులే నేరుగా దర్శకుడిని ప్రశ్నించాల్సి వచ్చేదని విశాల్ భరద్వాజ్ గుర్తుచేసుకున్నారు. అసలు సీన్‌లో ఏం చేయాలి? ముద్దు సీన్ ఎలా ఉంటుంది? మరింత ఇంటిమేట్‌గా చేయాలా? అనే ప్రశ్నలు దర్శకుడినే అడగాల్సి వచ్చేదని చెప్పారు.

ఒక సందర్భంలో ఓ హీరోయిన్ తనను నేరుగా.. ‘‘సర్.. ఇందులో టంగ్ యూజ్ చేయాలా? మేల్ యాక్టర్‌ని మీరు అడుగుతారా?’’ అని అడిగిందని విశాల్ భరద్వాజ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అలాంటి ప్రశ్నను తాను వెళ్లి మరో నటుడిని అడగాల్సి రావడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని వాపోయాడు విశాల్.

భార్యాభర్తలు కావడంతో

ఇంటిమసీ డైరెక్టర్ ఉంటే సీన్ ఎలా ఉండాలి, నటీనటుల ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్లో ముందుగానే క్లారిటీ వస్తుందని,ఫలితంగా షూటింగ్ మరింత స్మూత్‌గా సాగుతుందని తెలిపాడు .ఇక ‘Lust Stories 3’ షూట్ సమయంలో జరిగిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు విశాల్. . ఆయన దర్శకత్వం వహించిన కథలో అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జంటగా నటించిన సంగతి తెల్సిందే.రియల్ గా వాళ్ళు భార్యాభర్తలు కావడంతో షూటింగ్ సమయంలో దాదాపు 50 శాతం శ్రమ తగ్గిందని చెప్పుకొచ్చారు.

ఇక కొన్ని సీన్స్ కి మొదట బాడీ డబుల్స్‌ను ఉపయోగించాలని మేకర్స్ భావించారట. కానీ అదితి రావు హైదరి బాడీ డబుల్‌ను చూసిన తర్వాత ఆమె స్వయంగా ఆ షాట్ చేయాలని నిర్ణయించుకున్నారని విశాల్ భరద్వాజ్ తెలిపారు.

తెరపై కనిపించే సన్నివేశాలు మాత్రమే కాదు

ఇక ‘Lust Stories’, ‘Lust Stories 2’ ప్రాంచైజీలోనే ‘Lust Stories 3’ కూడా నాలుగు డిఫరెంట్ స్టోరీస్ తో వచ్చింది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ ఈ నాలుగు కథలకు దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, అలీ ఫజల్, రాధికా మదన్ వంటి నటీనటులు కూడా ఈ ఆంథాలజీలో కీలకపాత్రల్లో కనిపించారు.

also read :‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ వచ్చేస్తోంది.. శర్వా ఫ్యాన్స్‌కు పండగే!

మొత్తానికి బోల్డ్ సీన్స్ అంటే కేవలం తెరపై కనిపించే సన్నివేశాలు మాత్రమే కాదని, వాటి వెనుక కూడా ఎంతో ప్లానింగ్, కమ్యూనికేషన్, ప్రొఫెషనలిజం ఉంటుందని విశాల్ భరద్వాజ్ మాటలని బట్టి అర్థం అవుతుంది !

Tags

Related News

తెల్ల కాగితం’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ లవ్ డ్రామా!

బాలయ్య వాయిస్ తో ‘డోంట్  ట్రబుల్  ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!

వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం-AK47’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ వచ్చేస్తోంది.. శర్వా ఫ్యాన్స్‌కు పండగే!

‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!

డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!

Big Stories

Advertisement
×