Anasuya: సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ(Anasuya) ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది. అనసూయ తనపై ట్రోలింగ్ చేస్తే అస్సలు ఊరుకోదు. వారందరికీ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. అయితే అలాంటి అనసూయ రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి ట్రోలర్స్ పై మండిపడ్డ ఈమె.. తన భర్త గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మరోసారి అనసూయ రెచ్చిపోయింది. “చెప్పు తెగుద్ది” అంటూ అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ అనసూయ చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఎవరికి ఇచ్చింది అనేది చూద్దాం.
షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన అనసూయ..
జబర్దస్త్ (Jabardasth) ద్వారా యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ.. ఆ తర్వాత పలు ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూనే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్, కీ రోల్స్ చేయడం మొదలు పెట్టింది. అలా రంగస్థలం మూవీ (Rangasthalam Movie) లో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర (Rangammattha Role) పాపులర్ అవ్వడంతో.. ఆ తర్వాత అనసూయ పూర్తిగా సినిమాలకే పరిమితమైంది. ఇక ఇండస్ట్రీని షేక్ చేసిన పాన్ ఇండియా మూవీ పుష్ప(Pushpa)లో దాక్షాయిణి (Daakshayini) అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న గెటప్ వేసి మొదటిసారి విలన్ గా అదరగొట్టింది. అయితే అలాంటి అనసూయ పై ఎప్పుడు ఎవరో ఒకరు సోషల్ మీడియా వేదికగానైనా లేదా బయట ఎక్కడ కనిపించినా కూడా అసభ్య కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అనసూయ మార్కాపురం
(Markapuram) లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది.
పోకిరీలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన అనసూయ..
ఇక అక్కడికి వెళ్లిన అనసూయ పై కొంతమంది యువకులు అసభ్యకర కామెంట్లు చేయడంతో వారిపై రెచ్చిపోయింది. “ఒరేయ్ చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు.. అమ్మ, అక్క, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ లని లేకపోతే మీ భార్యని ఇలాగే ఎవడైనా కామెంట్ చేస్తే.. ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా..? పెద్దవాళ్లతో ఎలా మెదలాలి? ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి? అనే సంస్కారం మీ ఇంట్లో నేర్పించలేదా” అంటూ వారిపై ఫైర్ అయింది. ప్రస్తుతం అనసూయ వాళ్ళని తిడుతూ ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అనసూయ మాటలపై చాలామంది స్పందిస్తూ వాళ్లకి సరైన బుద్ధి చెప్పావు అంటున్నారు..
ట్రోలర్స్ కి గట్టి కౌంటర్
ఇక అనసూయ పెట్టే పోస్టులపై,ఆమె డ్రెస్సింగ్ పై చాలా మంది అసభ్య కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ కామెంట్లు చేసిన ప్రతిసారి అనసూయ.. నా ఒళ్ళు నా ఇష్టం. నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే.. మీకెందుకు మా ఆయనే నన్ను ఏమనడం లేదు.. మీరు ఎవర్రా చెప్పడానికి ” అన్నట్లుగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అలా తాజాగా అనసూయ కొంత మంది పోకిరిలకు చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ అనసూయ ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటి తనంతో భయపడకుండా వార్నింగ్ లు ఇవ్వడంలో ముందుంటుందని చెప్పుకోవచ్చు.
ALSO READ:HBD Sheela kaur: బన్నీ పరుగు మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తోందో తెలుసా?