Udayabhanu: ఒకప్పుడు అద్భుతమైన వాక్చాతుర్యంతో గలగల మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్న యాంకర్ ఉదయభాను (Udayabhanu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమెకు పోటీగా ఝాన్సీ, సుమ వంటి యాంకర్లు వచ్చినా.. అంత పోటీలో కూడా తనదైన మార్క్ యాంకరింగ్ తో సత్తా చాటింది. ముఖ్యంగా ఆమె చేసిన ఎన్నో షోలలోని సన్నివేశాలను ఇప్పటికీ ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారు అంటే.. ఆమె తన పెర్ఫార్మెన్స్ తో షోని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుడికి , కంటెస్టెంట్స్ కి మధ్య వారధిలా నిలిచి ఎంతో మంది హృదయాలను తాకింది ఉదయభాను.
అలాంటి ఉదయభాను ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమై.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా ఈ సిరీస్ కి ఆమె నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఉదయభాను ప్రొడక్షన్స్ పేరిట నిర్మాతగా మారి నిర్మించిన తొలి సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఇంటర్వ్యూకి హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఢీ షో రాకముందు డాన్సర్లను ఇండస్ట్రీలో ఎలా ట్రీట్ చేసేవారు అనే విషయాలపై ఆసక్తికర కామెంట్లు చేసింది.
ఉదయభాను మాట్లాడుతూ.. “ఢీ షో కి ముందు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉండేది అంటే తెలుగు మాస్టర్స్ ని చాలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు. ముఖ్యంగా తెలుగు డాన్సర్స్ కి అసలు విలువ ఉండేది కాదు. అప్పట్లో ఒరేయ్ ఆ కుక్కని ఇక్కడ పిలుచు.. లేదా ఆ కుక్కని అక్కడ పెట్టు.. ఇలా మాట్లాడే వాళ్ళు.. నమ్మినా .. నమ్మకపోయినా .. నేను నా కల్లారా చూసాను. డాన్సర్స్ ని ఒకప్పుడు కుక్కలతో పోల్చేవాళ్ళు. ఇక ఢీ షో వచ్చాక మన తెలుగు వాళ్ళు రావడం ఇప్పుడు రూలింగ్ చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.
ALSO READ: “నిజం ఎప్పుడూ దాగదు”.. మాధురి రాథోడ్ సంచలన పోస్ట్!
ఒకప్పుడు జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్ ఇలా ఎంతోమంది ఢీ కొత్తలో డాన్సర్స్ గానే తమ కెరియర్ను మొదలుపెట్టారు . ఇదే షో వేదికగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ కొరియోగ్రాఫర్స్ గా మారిపోయారు. ఇక వీరందరి ఎదుగుదల చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తెలుగు డాన్సర్లకు, తెలుగు కొరియోగ్రాఫర్లకు ఒక గుర్తింపు లభించింది అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను. మొత్తానికి అయితే ఢీ వచ్చాకే మార్పు వచ్చింది అంటూ ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.