E-Paper
Advertisement

డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

India First Indigenous Driverless Metro: ఇండియన్ మెట్రో సర్వీసులలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే తొలిసారి డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్లు రాబోతున్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో అడుగు పెట్టబోతున్నాయి. గుజరాత్ సంస్కృతికి ప్రతీకలైన గర్భా, ఉత్తరాయణ థీమ్‌లతో రూపొందించిన 10 కొత్త మెట్రో రైలు సెట్లు సర్వీసులు అందించబోతున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి పూర్తిగా దేశంలోనే తయారైన డ్రైవర్‌ లెస్ మెట్రో రైళ్లు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైళ్లను ప్రయాణికుల సేవల్లోకి తీసుకురావడానికి ముందు గ్యాస్‌ పూర్ డిపోలో పలు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

దేశంలోనే తయారైన డ్రైవర్‌లెస్ రైళ్లు

ఈ కొత్త రైళ్లను పశ్చిమ బెంగాల్‌ కు చెందిన టైటాగఢ్ రైల్ సిస్టమ్స్  మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారు చేసింది. ఇవి ఆటోమేషన్ గ్రేడ్ 4 (GoA4) టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే, రైలు నడపడానికి డ్రైవర్ అవసరం లేని స్థాయిలో ఆటోమేటెడ్ ఆపరేషన్ ఉంటుంది. ఈ రైళ్లు 750V DC విద్యుత్ వ్యవస్థపై పనిచేసేలా రూపొందించారు. దీంతో దేశీయంగా తయారైన అధునాతన మెట్రో రోలింగ్ స్టాక్‌కు ఇవి ఎగ్జాంఫుల్ గా నిలువనున్నాయి.

టెక్నాలజీతో పాటు సంస్కృతికి ప్రాధాన్యం

Advertisement

కొత్త రైళ్లలో టెక్నాలజీతో పాటు గుజరాత్ సంస్కృతికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గర్భా నృత్యం, ఉత్తరాయణ పండుగ స్ఫూర్తితో రైళ్ల లోపలి, బయటి డిజైన్లను రూపొందించారు. దీంతో సాధారణ మెట్రో రైళ్లకు భిన్నంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక రూపాన్ని కలిగి ఉన్నాయి.

గంటకు 90 కిలోమీటర్ల వేగం

కొత్త రైలు సెట్లు స్టెయిన్‌ లెస్ స్టీల్ బాడీతో ఉంటాయి. ఇవి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ప్రతి రైలులో పూర్తిస్థాయి ఏసీ సదుపాయం ఉంటుంది. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలు, స్మార్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ ను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కోచ్‌లలో CCTV కెమెరాలతో పాటు అగ్ని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అధునాతన వ్యవస్థ ఉంటుంది.

10 రైళ్లకు రూ.350 కోట్ల ఖర్చు

Advertisement

మొత్తం 10 రైలు సెట్ల కోసం సుమారు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూడు కోచ్‌ల రైలు సెట్‌కు దాదాపు రూ.35 కోట్లు వ్యయం అవుతుంది. అహ్మదాబాద్‌కు చేరుకున్న రైళ్లను వెంటనే ప్రయాణికుల సేవల్లోకి తీసుకురారు. ముందుగా గ్యాస్‌ పూర్ డిపోలో నిర్వహణ పనులు, సాంకేతిక తనిఖీలు చేపడతారు. భద్రతా పరీక్షలు పూర్తయ్యాకే సర్వీసులు ప్రారంభిస్తారు.  గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబించే డిజైన్‌తో పాటు డ్రైవర్‌ లెస్ టెక్నాలజీని కలిపిన ఈ కొత్త రైళ్లు అహ్మదాబాద్ మెట్రోకు సరికొత్త రూపాన్ని తీసుకురానున్నాయి.

Read Also: భారత్‌లోని లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు ఇదే.. వామ్మో.. అన్ని వందల కిలో మీటర్లు ఆగకుండా వెళ్తుందా?

Tags

Related News

ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

భారత్‌లోని లాంగెస్ట్ నాన్‌స్టాప్ రైలు ఇదే.. వామ్మో.. అన్ని వందల కిలో మీటర్లు ఆగకుండా వెళ్తుందా?

పదో తరగతి కూడా పాస్ కాలేదు.. అయినా, బోయింగ్, రోల్స్ రాయిస్ నమ్మిన కంపెనీకి అధిపతిగా ఎదిగాడు!

ఢిల్లీలో అడుగు పెట్టబోతున్న హైడ్రోజన్ రైలు.. అసలు ప్లాన్ ఇదే!

ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!

రైలు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదా? పండుగ వేళ ఇలా బుక్ చేసుకోండి!

గంటకు 350 కి.మీ.. భారత్ తయారు చేయనున్న కొత్త బుల్లెట్ రైలు ఇదే!

Big Stories

Advertisement
×