Madhuri Rathod: మాధురి రాథోడ్.. ఫోక్ సాంగ్స్ చేస్తూ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నో ఆల్బమ్ సాంగ్స్ తో ఫోక్ డాన్సర్ గా మారి పాపులారిటీ సొంతం చేసుకుంటూ స్టార్ స్టేటస్ అందుకునే సమయంలో అనూహ్యంగా ఇబ్బందులు ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. తనతో పాటు డాన్స్ చేస్తూ ఆల్బమ్ సాంగ్స్ తో క్రేజ్ దక్కించుకున్న ఈశ్వర్ సాయి (Eshwar Sai) తో వేములవాడ రెడ్డి భవన్ లో ఏకాంతంగా ఈశ్వర్ సాయి భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ అంటూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన ఈమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అయితే ఇప్పుడు అన్నింటినీ వదిలేసి భగవంతుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ “నిజం ఎప్పటికీ దాగదు” అంటూ పెట్టిన పోస్ట్ సంచలనగా మారింది.
భగవంతుడి సన్నిధిలో దర్శనమిచ్చిన మాధురి రాథోడ్.. కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. “నిజానికి సమయం పడుతుంది. కానీ అది ఎప్పుడూ దాగి ఉండదు. దేవుడికి నా నిజం తెలుసు. కాలం దానిని బహిర్గతం చేస్తుంది” అంటూ సంచలన పోస్టు షేర్ చేసింది.
ఇకపోతే తన తప్పు లేదని , ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, ఇప్పుడు మోసం చేశాడు అంటూ ఆమె వాదిస్తున్న విషయం ఎవరు పట్టించుకోలేదు. పైగా పోలీసులు కూడా తనకు సహాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా భగవంతుడి సన్నిధిలో కనిపించేసరికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
also read:బిగ్ బాస్ 10 3వ వారంలో నామినేట్ అయ్యింది వీరే.. అయ్యో వీరు కూడానా?
మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం తర్వాత మళ్లీ కనిపించి పోస్ట్ పెట్టడంతో అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెకు అండగా నిలుస్తున్నారు. బి స్ట్రాంగ్ అని, మళ్లీ ఆల్బమ్ సాంగ్స్ చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా సుదీర్ఘ కామెంటు పంచుకున్నారు. ” ఒక అమ్మాయి జీవితంలో ఏ తప్పు జరిగినా.. ఆ తప్పు కంటే ఆమె ప్రాణం ఎప్పుడూ విలువైనది. ఈరోజు మనం ఆమెను ట్రోల్స్ చేస్తూ రాసిన ఒక మాట మనకు ఐదు నిమిషాల కోపం మాత్రమే కావచ్చు. కానీ అదే మాట ఆమె మనస్సులో మాత్రం ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు మోగుతుండొచ్చు.. ఆమె చేసిన పని తప్పు అయితే తప్పు అని దాన్ని చెప్పండి..
కానీ ఆమెను మనిషిగా అవమానించకండి. ఒంటరిని చేయకండి.. ఆమెకు నీకు జీవించే హక్కు లేదు అనే భావన కలిగించకండి. ఎందుకంటే తప్పు చేసిన మనిషికి శిక్ష ఉండొచ్చు.. కానీ ఆ శిక్ష ఆమె ప్రాణం కావాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఆమె తన తప్పును తెలుసుకొని ,అర్థం చేసుకొని, పశ్చాతాపపడి, తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అవకాశం ఆమెకు ఇవ్వాలి. అందుకే ఆమెను చూసి నవ్వే ముందు.. ట్రోల్స్ చేసే ముందు.. ఒకసారి మనసులో ప్రశ్నించుకోండి. నా మాట వల్ల ఆమె ఇంకా విరిగిపోతే ? ఆ బాధ్యతను నేను మోయగలనా? అని.. తప్పును ఖండించండి.. మనిషిని కాదు.. ప్రాణం పోయిన తర్వాత పశ్చాత్తాపం కంటే.. మనిషి బ్రతికున్నప్పుడే కొంచెం మనసుతో ఆలోచిస్తే చాలా గొప్పది” అంటూ సుదీర్ఘ కామెంట్ చేశారు .