Prakasam Crime: ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో ఓ దారుణ ఘటన కలకలం రేపుతుంది. గ్రామంలో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు తన సోంత నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు ఎపీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది.
నిక పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఎపీలోని పెద్దబొమ్మలాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు తీవ్రంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నానమ్మతో మద్యం మత్తులో ఉండి గొడద పడ్డాడు. అనంతరం తీవ్ర ఆవేశానికి లోనై మద్యం మత్తులో విచక్షనకు లోనై ఓ బాటిల్‌లో పెట్రోల్ తీసుకువచ్చి నానమ్మపై పోసి నిప్పంటించాడు.
దీంతో మంటు తీవ్రమవ్వడంతో వృద్ధురాలు భయాందోళనకు గురై అర్తనాదాలు చేసింది. దీంతో ఆమే అరుపులు విన్న పక్కవారు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే తీవ్రంగా గాయపడిన వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనకు భాద్యుడైన మనువడిని అక్కడి స్థానికులు దేహశుద్దిచేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిపై కేసునమోదు చేసి రిమాండుకు తరలించారు.
Also read: బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!