E-Paper
Advertisement

ఏటీఎంలో మీ కార్డ్ ఇరుక్కుపోయిందా? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే క్షణాల్లో రికవరీ!

ఏటీఎంలో మీ కార్డ్ ఇరుక్కుపోయిందా? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే క్షణాల్లో రికవరీ!
Advertisement

ATM card stuck: మన రోజువారీ జీవితంలో ఏటీఎం వాడకం సర్వసాధారణమైపోయింది. అత్యవసర సమయంలో.. డబ్బులు తీసుకోవడానికి వెళ్లినప్పుడు.. ఒక్కో సారి అనుకోకుండా మన ఏటీఎం కార్డ్ మిషన్‌లో ఇరుక్కుపోవడం లేదా లాక్ కావడం జరుగుతుంది. ఆ సమయంలో.. కొందరు కంగారు పడిపోయి పక్కవారి సహాయం తీసుకుంటారు లేదా మిషన్‌‌ను బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ.. అలా చేయడం వల్ల మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఏటీఎం కార్డ్ ఇరుక్కున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ATM లో కార్డ్ ఇరుక్కుపోతే ఏం చేయాలి?

డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ పేమెంట్స్ పెరిగినప్పటికీ, అత్యవసర క్యాష్ కోసం మనం ఏటీఎం సెంటర్ల పైనే ఆధారపడుతున్నాము. కొన్ని సార్లు టెక్నికల్ సమస్యల వల్ల లేదా పవర్ కట్ అవ్వడం వల్ల ఏటీఎం మిషన్ సరిగ్గా పని చేయదు. ఆ సమయంలో మన డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మిషన్ లోపల ఇరుక్కుపోతుంది. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

1. కంగారు పడొద్దు:

కార్డ్ మిషన్‌లో ఇరుక్కోగానే చాలా మంది భయ పడిపోయి మిషన్‌ను బాదడం లేదా కీబోర్డ్‌ను వరుసగా నొక్కడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మిషన్ మరింత బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా ప్రశాంతంగా ఉండండి. మీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ మీద ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుందో గమనించండి.

Advertisement

2. ‘Cancel’ బటన్ నొక్కండి:

మీ కార్డ్ ఇరుక్కున్న వెంటనే.. కీ బోర్డ్‌పై ఉన్న ‘Cancel’ బటన్‌ను కొన్ని సెకన్ల పాటు గట్టిగా నొక్కి పట్టుకోండి. కొన్ని సార్లు టెక్నికల్ గ్లిచ్ వల్ల సిస్టమ్ రీసెట్ అయ్యి కార్డ్ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేస్తుంది.

3. ఏటీఎం నుంచి రావొద్దు :

కొందరు కార్డ్ రాలేదని వెంటనే సెంటర్ బయటకు వెళ్లిపోతుంటారు. అలా అస్సలు చేయకండి. మీ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయ్యిందా లేదా స్క్రీన్ మీద ‘Please Take Your Card’ అని వస్తుందా అని చూడండి. ఒక వేళ మీ మొబైల్‌కు డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే జాగ్రత్త అవసరం.

4. ఇతరుల సహాయం తీసుకోవద్దు:

ఏటీఎం సెంటర్‌లో ఉండే అపరిచితులు లేదా బయట నిలబడే ఏజెంట్స్ సహాయం ఎప్పటికీ తీసుకోవద్దు. వారు మంచివారలా నటించి మీ పిన్ నెంబర్ తెలుసుకునే అవకాశం ఉంది. మీ కార్డ్‌‌ని బ్లాక్ చేయడానికి.. వారిని నమ్మి ఫోన్ చేయకండి.

5. బ్యాంక్ కస్టమర్ కేర్‌:

మీ కార్డ్ ఏ విధంగానూ బయటకు రాకపోతే.. వెంటనే మీ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కార్డ్‌ని తాత్కాలికంగా బ్లాక్ చేయించండి. దీని వల్ల మీ అకౌంట్ లోని డబ్బులు ఎవరిపైనా డ్రా కాకుండా ఉంటాయి. ప్రస్తుతం అన్ని ప్రముఖ బ్యాంకులు (SBI, HDFC, ICICI మొదలైనవి) 24/7 కస్టమర్ కేర్ సేవలను అందిస్తున్నాయి.

6. మీ హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించండి:

కార్డ్ ఇరుక్కుపోయిన సెంటర్ ఏ బ్యాంకుకు చెందిందో.. ఆ బ్రాంచ్‌ను లేదా మీ సొంత బ్రాంచ్‌ను పని వేళల్లో సంప్రదించండి. మీ కేవైసీ (KYC) డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాస్‌బుక్ చూపించి మీరు మీ కార్డ్‌ని రికవరీ చేసుకోవచ్చు.

Also Read: మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

7. కొత్త కార్డ్ కోసం అప్లికేషన్:

ఒకవేళ మీ కార్డ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా లేదా దొరకకపోయినా కొత్త కార్డ్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ డెబిట్ కార్డ్ రీ-ఇష్యూ ఛార్జీలు సుమారు రూ. 150 నుంచి రూ.300 వరకు ఉంటాయి . కొత్త కార్డ్ మీ ఇంటికి చేరడానికి సాధారణంగా 5 నుంచి 7 రోజులు పడుతుంది. ఈలోగా మీరు UPI లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ ట్రాన్సాక్షన్స్ కొనసాగించవచ్చు.

ఏటీఎం కార్డ్ ఇరుక్కుపోవడం అనేది ఒక చిన్న టెక్నికల్ సమస్య మాత్రమే. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరైన అవగాహన, ప్రశాంతతతో వ్యవహరిస్తే.. మీ డబ్బులు, కార్డ్ రెండూ జాగ్రత్తగానే ఉంటాయి.

Related News

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..బెస్ట్ పార్టీ స్పీకర్లపై మతిపోయే ఆఫర్

ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? అయితే ఈ 5 హై-సక్షన్ వాక్యూమ్ క్లీనర్స్ ట్రై చేయండి!

15 సెకన్ల క్రితం ఏం మాట్లాడారో మళ్లీ వినొచ్చు.. యాపిల్ వాచ్‌లో సరికొత్త AI ఫీచర్!

శాంసంగ్ M సిరీస్, ఫోల్డబుల్ ఫోన్లపై ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు.. ఇంత తక్కువకి మళ్లీ దొరకవు!

శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్.. 2-ఇన్-1 ల్యాప్ టాప్

Big Stories

Advertisement
×