Vishnu Priya : టాలీవుడ్ టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ షో కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ వస్తుంది.. ఈ షో ద్వారా చాలామంది సెలబ్రిటీలు గా అయిపోయారు.. కొందరేమో గతంలో ఉన్న ఆఫర్స్ ని కూడా కోల్పోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితాన్ని బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పాలి. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్లతో పోలిస్తే గత సీజన్లో బోరింగ్ లవ్ స్టోరీ అంటే పృథ్వి, విష్ణుప్రియ.. ఈ జంట మధ్య సాగే లవ్ ట్రాక్ జనాలని విసిగించిందని చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కనిపించినా ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా పృథ్వీ వల్ల విష్ణు ప్రియ బాగా హర్ట్ అయిందంటూ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..
విష్ణు ప్రియా హార్ట్ బ్రేక్..
బిగ్ బాస్ సీజన్ 8 లో సీరియల్ నటుడు పృథ్వీతో విష్ణు ప్రియకు పరిచయం ఏర్పడింది. టిఆర్పి రేటింగ్ కోసమో తెలియదు కానీ వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. విష్ణు ప్రియ పృథ్వీపై ప్రేమను వలకబోసింది. ఇదంతా చూసి నిజంగానే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అని జనాలు అనుకున్నారు. బయటకు వెళ్లిన తర్వాత కూడా పలు షోలలో వీళ్ళిద్దరి తీరు అలానే ఉంది. అయితే తాజాగా అదంతా నిజం కాదని తేలిపోయింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ షో కి పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి విష్ణుకు షాకిచ్చింది. పృథ్వీ ఇది నీకోసం అంటూ ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది దర్శిని. నాకు ఫ్రెండ్‌గా ఉన్నందుకు థాంక్యూ.. అంటూ పృథ్వీకి చెప్పింది. ఇది వినగానే అక్కడే ఉన్న నిఖిల్.. థాంక్యూ ఫర్.. ఫ్రెండా ఏంటది అంటూ డైలాగ్ వేశాడు. అదే బెస్ట్ ఫ్రెండ్‌లే అంటూ కవర్ చేసింది దర్శిని.. షోలో వీరిద్దరిని చూసిన విష్ణు ప్రియా బాగా హర్ట్ అయ్యిందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది…
Also Read : సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రీలీల.. ‘బిగ్ డే’ అంటూ ఫోటోలు..
పృథ్వి-దర్శిని లవ్ ట్రాక్…
స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాకుతో రన్నైనా సీరియల్స్లలో నాగపంచమి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్లో హీరోగా పృథ్వి నటించగా.. హీరోయిన్ గా దర్శిని నటించింది. సీరియల్‌లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి రియల్‌గా కూడా జోడీ అయితే బావుంటుందని ఎంతోమంది అనుకున్నారు. తర్వాత పృథ్వీ బిగ్‌బాస్‌కి వచ్చాక తన కోసం స్టేజ్ మీదకి కూడా దర్శిని వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా మరోసారి పృథ్వీ కోసం షోకి వచ్చింది దర్శిని గౌడ.. షో నిర్వాహకులు వీరిద్దరిని హైలెట్ చేసి చూపించడంతో నిజంగానే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ లవ్ మేటర్ పక్కన పెడితే ఈ షో ప్రోమో మాత్రం అదిరిపోయింది. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..