Vishnupriya: ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘పోవే పోరా’ అనే షోతో యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, ఇక్కడ తనదైన మాట తీరుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విష్ణు ప్రియ.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ వన్ సైడ్ లవర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విష్ణు ప్రియ.. బయటకు వచ్చిన తర్వాత పృథ్వి శెట్టిని వివాహం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అదంతా స్క్రీన్ వరకే అని తెలిసి అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిత్యం ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విష్ణు ప్రియ సబ్స్క్రైబ్ పేరిట ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.ముఖ్యంగా నెలకు రూ.399 చొప్పున సబ్స్క్రిప్షన్ పెట్టింది. తన అందాల ఆరబోత చూడాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ పెట్టిన కండిషన్ కొంతమందిని ఆగ్రహానికి గురిచేసినా.. వేలలో ఫాలోవర్స్ రావడం గమనార్హం. ముఖ్యంగా ఈమెపై పలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లు కూడా నమోదయ్యాయి. యువతను తప్పుదోవ పట్టించేలా విష్ణు ప్రియ వీడియోలు ఫోటోలు ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్లు చేశారు అయితే దీనిపై ఆమె ఘాటుగానే స్పందించింది . దేవుడు ఇచ్చిన శరీరాన్ని చూపించుకోవడంలో తప్పులేదు అంటూ ట్రోలర్స్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
అలాంటి ఈమె తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. బికినీ టైపు దుస్తులు ధరించి ఉల్లి పొరలాంటి జాకెట్ తో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు విష్ణుప్రియ ఇలాంటి వీడియోలు చేసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది అంటూ అటూ ఈమె అభిమానులు కూడా ఈమెపై మండిపడుతున్నారు.. గ్లామర్ వలకబోయడానికి కూడా ఒక హద్దు ఉంటుందని, గ్లామర్ వలకబోయడమే పనిగా పెట్టుకోకూడదు అంటూ ఈమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అయితే విష్ణు ప్రియ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలే అల్లరి నరేష్ జోనర్ మార్చి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంభ ఊర్వశి మేనక సినిమాలో రంభ ఊర్వశి మేనకలలో ఒకరిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా వస్తాయనుకుంటే ఈమె మాత్రం ఇలా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేస్తున్న వీడియోలతోనే హల్చల్ చేస్తోంది. ఈ గ్లామర్ ట్రీట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..