Big Stories

PM Modi: వికసిత్ భారత్ గ్యారంటీ నాదే.. ప్రధాని మోదీ హామీ..

PM Modi’s speech at the National Council meeting: నవభారత్‌ నిర్మాణం కోసం నిరంతరం పనిచేద్దామని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలునిచ్చారు. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే వంద రోజులు పార్టీకి ఎంతో కీలకమన్నారు.

- Advertisement -

గడిచిన పదేళ్లలో దేశ రూపురేఖలు మార్చామని మోదీ అన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదనీ.. దేశమే ముఖ్యమన్నారు. గత పదేళ్లలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోందన్నారు. ఇవాళ్ల మనందరం కలిసి దేశం కోసం పని చేయాల్సింది ఇంకా చాలా ఉందని తెలిపారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో 370 సీట్లు గెలవడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.18 సంవత్సరాలు నిండినవాళ్లు అందరూ 18వ ఎన్నికల్లో పాల్గొని బీజేపీని గెలిపించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పేద, మద్య తరగతి వర్గాలకు చేయుతనిస్తున్నామన్నారు. మహిళలు, యువత అందరి చూపు బీజేపీ వైపే ఉందన్నారు. తనకు కుటుంబం లేదనీ.. దేశమే తనకు కుటుంబం అన్నారు. దేశానికి సేవ చేసుకోవడమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. దేశానికి కొత్త పార్లమెంటు ను నిర్మించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశం అభివృద్ది దేశంగా మారబోతుందని పేర్కొన్నారు.

Read More: మోదీ 3.0 ఖాయం.. అమిత్ షా విశ్వాసం..

దేశ అభివృద్దిలో బీజేపీ కార్యకర్తలది కీలక పాత్ర అని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ క్యాడర్ అంతా ఒక్కటిగా పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అబద్దాలు చెప్పబోమన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ నాదేనని మోదీ హామీ ఇచ్చారు.

మూడోసారి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పండితులెవ్వరికీ గెలుపు కారణాలు దొరకవని పేర్కొన్నారు.

తాను వీధుల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రం. భిన్నత్వంలో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నాం’అని ప్రధాని మోదీ చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News