
SEETHAKKA: సచివాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సచివాలయానికి వెళ్తే పోలీసులు అడ్డుకొని ఒక నియంత లాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని గొప్పగా చూపించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రారు, ప్రజల వద్దకు వెళ్లే వాళ్ళను అడ్డుకుంటారని, అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తారన్నారని సీతక్క ఆగ్రహించారు. సచివాలయం ఉన్నది కేవలం బీఆర్‌ఎస్ వాళ్లకేనా అని ప్రశ్నించారు. సచివాలయానికి ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని బోర్డులు పెట్టుకోండని సీతక్క మండిప్డడారు .