E-Paper
Advertisement

Ambajipeta Marriage Band in OTT: అరరే అపుడే ఓటీటీలోకి సుహాస్ కొత్త సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

Ambajipeta Marriage Band in OTT: అరరే అపుడే ఓటీటీలోకి సుహాస్ కొత్త సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?
Advertisement
Ambajipeta Marriage Band

Suhas Ambajipeta Marriage Band streaming on Aha on 1st March: సినీ ఇండస్ట్రీ ఎంతో మంది జీవితాలను మార్చింది. ఎంతో మంది కలలను నెరవేర్చింది. అందువల్లనే ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఒక్క అవకాశం కోసం ఎన్నో ఏళ్లు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి ఛాన్స్ ఒక్కసారి వస్తే తమ టాలెంట్ నిరూపించుకుంటారు. ఇలాంటి అవకాశం పొంది ఎంతో మంది ఇప్పటికీ స్టార్లుగా ఎదిగారు.

అలాంటి అవకాశాన్నే తాజాగా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాడు. తనకు ఇచ్చిన ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసేవాడు. పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

ఇక సైడ్ క్యారెక్టర్ల నుంచి హీరోగా ప్రమోషన్ పొందాడు. కలర్ ఫొటో సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమాతోనే సుహాస్.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్ చిత్రంలో విలన్‌గా నటించి.. ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీని అందుకున్నాడు.

READ MORE: suhas – Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లేటెస్ట్ కలెక్షన్స్.. సుహాస్‌ ఖాతాలో మరో హిట్టు

Advertisement

ఆ తర్వాత తన వద్దకు వచ్చిన ఎన్నో సినిమా కథలలో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే గతేడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా మూవీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. సుహాస్‌ని ఈ సినిమా మరింత ఎత్తుకి ఎదిగేలా చేసింది. ఆ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌లో నటించాడు.

అది కూడా ఓటీటీ ఆడియన్స్‌ను బాగా అలరించింది. ఇలా వరుస సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సుహాస్ రీసెంట్‌గా మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమాతో వచ్చాడు. దుష్యంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చి.. అందరినీ ఆకట్టుకుంది.

అంతేకాకుండా కలెక్షన్లలో కూడా దూసుకుపోతుంది. ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్ వైపుగా పరుగులు పెట్టింది. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీలో శివాని నగరం హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ మూవీతో ఆమె కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

READ MORE: Suhas: ట్రైలర్‌ అదిరిపోయింది.. సుహాస్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీ..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. అంటే.. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుందన్న మాట. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×