Big Stories

Jyoti Amge: నాగ్‌పూర్‌లో.. ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ..!

Jyoti Amge Case Her vote in Nagpur: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమవగా..నాగ్‌పూర్‌లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణ పౌరులతో పాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే నాగ్‌పూర్‌లో ఓటు వేసారు.

- Advertisement -

- Advertisement -

కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన జ్యోతి.. అందరితో పాటు క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జ్యోతి అన్నారు. దేశ పౌరులుగా ఓటు వేయడం అందరి బాధ్యత అని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. తాను చదువుకున్న స్కూల్‌లోనే ఓటు వేశానని అన్నారు జ్యోతి.

Also Read: First Phase Loksabha Elections : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్.. ఓటేసిన హీరోలు, రాజకీయనేతలు

102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. 21 రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా..ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాధారణ వ్యక్తులతో పాటుగా క్యూ లైన్లలో నిల్చొని ఓటు వేస్తున్నారు. కాగా, తొలి విడత ఎన్నికల్లో 1625 మంది అభ్యర్థులు బరిలో దిగగా.. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News