DSP Wife: ఆమె ఓ గవర్నమెంట్ ఆఫీసర్ సతీమణి. బాధ్యతను మరిచి కాస్త ఓవరాక్షన్ చేసింది. ఆమె చేసిన పనికి.. తన భర్తతో పాటు ఇతర అధికారులకు టెన్షన్ కు గురిచేసింది. వారికి పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డీఎస్పీ భార్య తన పుట్టిన రోజు వేడుకల కోసం ప్రభుత్వ అధికారిక వాహనాన్ని ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై కేరళ కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యింది. ఇది అధికారిక వాహనం.. ఇలా దుర్వినియోగం చేయడంపై ఏంటని పలు ప్రశ్నలను లేవనెత్తింది.
Chhattisgarh DSP's wife celebrates her birthday in full style, using her husband's official vehicle. Please wish her a very happy birthday, and let’s not disrespect her by calling this mere VIP culture. pic.twitter.com/WYH6I22hTk
— Congress Kerala (@INCKerala) June 16, 2025
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బంజ్‌గిర్ – చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం అరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్. ఆమె తన బర్త్ డే వేడుకలను జరుపుకునేందుకు ప్రభుత్వ వాహనాన్ని వాడింది. దీంతో ఈ మ్యాటర్ కాస్త ఇప్పుడు వివాదస్పదంగా మారింది. తన బర్త్ సందర్భంగా పోలీస్ వెహికిల్ బ్యానెట్‌పై కూర్చొని కేక్ కట్ చేసింది. అంతే కాకుండా.. స్నో స్ప్రే తో వెహికిల్ అద్దంపై 32 అనే నెంబర్‌ను రాసింది. తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న పర్సన్ వైపర్స్‌తో దానిని క్లీన్ చేశాడు. దీంతో ఓకోకుండా తను మళ్లీ.. 33 అనే నంబర్‌ను రాసింది. అదే సమయంలో వెహికల్ బ్యానెట్‌పై కేక్, పుష్ఫ గుచ్ఛం కూడా పెట్టింది. ఇలా తను ఓవరాక్షన్ చేసింది. ఇదంతా ఫోన్ లో రికార్డు కూడా చేశారు. ఇలా కారు స్లో రన్నింగ్‌లో కారు ముందు భాగంలో కూర్చొని డీఎస్పీ భార్య ఫర్హీన్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారిక వాహనంలో ఇతర కుటుంబ సభ్యులు, మహిళలు కూడా ఉన్నారు. వారంతా అధికారిక వెహికల్ ను ఉపయోగించి ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Chhattisgarh DSP's wife celebrates her birthday in full style, using her husband's official vehicle. Please wish her a very happy birthday, and let’s not disrespect her by calling this mere VIP culture. pic.twitter.com/WYH6I22hTk
— Congress Kerala (@INCKerala) June 16, 2025
ఈ క్రమంలోనే డీఎస్పీ భార్య బర్త్ డే వేడుకులకు ఉపయోగించి ప్రభుత్వ వాహనంలో వీడియోలో కనిపించడంతో మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకు, ప్రజా అవసరాలకు మాత్రమే వాడాలి. వ్యక్తిగత అవసరాల కోసం వాహనాలను వాడడం చట్ట విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్ లాంటి అధికార గుర్తింపు ఉన్న వాహనాలను వాడడం నేరంగా పరగణిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలు స్పందిస్తున్నారు.
డీఎస్పీ భార్యపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే కేరళ కాంగ్రెస్ అగ్రహం వ్యక్తం చేసింది. ఇది అధికారిక వాహనం.. ఇలా దుర్వినియోగం చేయడంపై ఏంటని పలు ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.