E-Paper
Advertisement

Cyber criminals: ఫేస్ బుక్ పరిచయం.. 14 కోట్లు బొక్క! అసలేం జరిగిందంటే?

Cyber criminals: ఫేస్ బుక్ పరిచయం.. 14 కోట్లు బొక్క! అసలేం జరిగిందంటే?
Advertisement

Cyber criminals: హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన డాక్టర్‌ను ఘరానా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఫేస్‌బుక్‌లో పరిచయంతో 14 కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. ఫేస్‌బుక్‌లో డాక్టర్‌కు ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో డాక్టర్ మహిళ మాటలు నమ్మి సెప్టెంబర్ నుండి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ఒక్కసారి వచ్చిన లాభాల్లో 86 వేల రూపాయలు విత్‌డ్రా చేసుకున్నాడు. దీంతో నమ్మకం కుదరడంతో విడతలవారీగా తనకున్న ఆస్తులను కుదువ పెట్టి 14 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు బాధితుడు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా పెద్ద మెుత్తంలో పన్ను కట్టాలని సైబర్ నేరస్తులు అడిగారు. దీంతో బాధితుడు ఈ ఘరానా మోసంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×