DJ Sound: పండుగైనా, పెళ్లయినా… సందడి ఉండాలి.. కానీ ఆ సందడి హద్దులు దాటితే? రాంనగర్‌లో నడిరోడ్డుపైనే యువకుడు కుప్పకూలి మృతి చెందడం.. అంతకుముందు మహబూబ్‌నగర్‌లో మరో యువకుడి మరణం.. డీజే సౌండ్‌పై కొత్త చర్చకు తెరలేపాయ్. ఆ సౌండ్లకు గుండెలు అదురుతున్నాయ్. ఆగిపోతున్నాయ్. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయ్? నివాస ప్రాంతాల్లో పగటి వేళ 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ మించకూడదు. కమర్షియల్ ఏరియాల్లో 65, 55 డెసిబుల్స్.. ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో 75, 70 డెసిబుల్స్ పరిమితి ఉంది. సాధారణంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్‌స్పీకర్లు, DJలకు ఆంక్షలు ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోవట్లేదు. సౌండ్ విషయంలో లిమిట్స్ ఎందుకు దాటాలన్న ప్రశ్నలు వస్తున్నాయ్. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై మంత్రుల మధ్యే భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయ్. కొన్ని ప్రాంతాల్లో DJలపై కఠిన ఆంక్షలు పెడుతున్నారు. అయితే పరిష్కారం పూర్తిస్థాయి నిషేధమా.. లేక నిబంధనలను కఠినంగా అమలు చేయడమా?