Big Stories

Gujarat Business man: మతుండే ఈ పని చేస్తున్నారా.. రూ. 200 కోట్ల ఆస్తి విరాళం ఇచ్చి సన్యాసిగా మారుతున్నారట..

 

- Advertisement -

Gujarat Business man: పిచ్చి పలు రకాలు అంటారు. కొంత మంది చేసేవి పిచ్చి చేష్టలు అనిపిస్తుంటాయి. మరికొంత మంది చేసే పనులు మాత్రం అసలు ఎందుకు ఇలా చేశారో కూడా అర్థం కాకుండా ఉంటాయి. అయితే కొంత మంది ఫేమ్ కోసం చేసినా..మరి కొంత మంది మాత్రం వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ భార్యభర్తల జంట తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు వారు ఏం చేశారు? ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఏకంగా వారికి ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేశారు ఓ భార్యాభర్తలు. సంపన్న కుటుంబంలో జన్మించిన గుజరాత్‌కు చెందిన వ్యాపారి భార్య తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా సన్యాసం పుచ్చుకున్నారు. వీరు సబర్ కాంత జిల్లాలోని హిమ్మత్ నగర్ కు చెందిన వాసులు. వ్యాపారి భవేష్ భాయ్ భండారీకి రూ. 200 కోట్ల ఆస్తి ఉంది. అయితే వారు భోగభాగ్యాలను వదులుకుని ప్రశాంత జీవితాలను గడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో తమకున్న ఆస్తిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే భవేష్ తరచూ జైన సంఘంలోని దీక్షాపరులను కలుస్తూ ఉండేవాడు. భవేష్, అతని భార్య కంటే ముందే వారి పిల్లలు కుమారుడు(160, కుమార్తె(9) ప్రపంచాన్ని వదిలి రెండు సంవత్సరాల క్రితమే అంటే 2022లోనే సన్యాసం పుచ్చుకున్నారు.

కుమారుడు, కుమార్తె బాటలోనే తాము కూడా నడవాలని నిర్ణయించుకున్న భవేష్, అతని భార్య తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేశారు. ఇక వీరు ఏప్రిల్ 22వ తేదీన జైన దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు వీరు ఏకంగా 35 మంది ముముక్షుల జైన దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కోసం ముముక్షుడు మోక్షాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే ఏప్రిల్ 18వ తేదీన ఈ ముముక్షుల మహామహాభినిష్క్రమణను గుర్తుచేసే ఉత్సవం 5 రోజులు జరుగుతుంది. దీక్ష చేపట్టిన ముముక్షులు ఏప్రిల్ 21వ తేదీన కిలోమీటర్ మేర ఊరేగింపు నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News