BigTV English

Snake Catcher Kissing King Cobra: పడగ విప్పిన కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టిన సురేష్.. భయానకమైన వీడియో!

Snake Catcher Kissing King Cobra: పడగ విప్పిన కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టిన సురేష్.. భయానకమైన వీడియో!
Vava Suresh King Cobra Kissing Video
Vava Suresh King Cobra Kissing Video

Snake Catcher Vava Suresh Kissing Huge King Cobra: ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకరమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఒక్కసారి ఈ పాము కాటేస్తే మనిషి 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడు. అంత త్వరగా ఆ పాము విషం శరీరం అంతా వ్యాపిస్తుంది. అయితే ఎంతో మందికి పాములు అంటే చచ్చేంత భయం ఉంటుంది. పాము పేరు వింటూనే చెమలు పట్టేస్తాయి. అలాంటిది కొంతమంది మాత్రం పాములతోనే ఆటలు ఆడుతుంటారు. పాములు పట్టుకుని, వాటితో సాహసాలు చేస్తుంటారు.


ప్రపంచంలో పాములకు భయపడేవారు ఉండే పాములను పట్టుకుని సాహసాలు చేసే వారు కూడా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే పాములను పట్టుకోవడం వరకు సరే కానీ.. అదే పాములతో ఆటలు ఆడుతుంటే వారి దైర్యాన్ని మెచ్చుకోవాలనిపిస్తుంది. అందులోను విషపూరితమైన కింగ్ కోబ్రా లాంటి పాములతో చేసే సాహసాలను చూస్తే.. అసలు ఎన్ని గుండెలు ఉంటే ఇలా చేయగలరు అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కింగ్ కోబ్రా కనిపిస్తేనే ఎక్కడికో పారిపోతుంటాం. అలాంటిది కేరళకు చెందిన సురేష్ అనే ఓ వ్యక్తి అదే కింగ్ కోబ్రాతో సాహసం చేశాడు. కింగ్ కోబ్రా వెనుక నుంచి వెళ్లి దానిని ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం సురేష్ చేసిన సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సురేష్ పాములను రక్షిస్తుంటాడు. అయితే ఇప్పటి వరకు సురేష్ దాదాపు 38000 పాములను పట్టుకున్నాడట. అంతేకాదు అందులో దాదాపు 3000 పాములు కాటు కూడా వేశాయట. దీంతో సురేష్ ను ‘స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ’ అని కూడా పిలుస్తారట.


Also Read: కింగ్ కోబ్రాతోనే ఆటలా.. బతకాలని లేదా అమ్మాయ్..

పాములలో ముఖ్యంగా కింగ్ కోబ్రా జాతికి చెందిన పాములకు 190కి పైనే రక్షించాడట. తాజాగా సురేష్ ఓ కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎంత దైర్యం ఉంటే తప్ప ఇలా చేయగలడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Big Stories

×