BigTV English

Viral Video: మూర్చపోయినట్లు నటించిన పైలట్.. ఏడ్చేసిన ప్రయాణికులు

Viral Video: మూర్చపోయినట్లు నటించిన పైలట్.. ఏడ్చేసిన ప్రయాణికులు

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా డ్రైవర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితులు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. ప్రయాణం మధ్యలో డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ అపస్మారకానికి గురైతే ప్రయాణికుల్లో భయాందోళనలు కలగడం సహజం. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కాదు ఏకంగా నిజజీవితంలోను కొన్ని అనుకోకుండా సీసీటీవీ కెమెరాల్లోనో లేక ఎవరో తీసుకునే వీడియోల్లోనో రికార్డ్ అవుతుంటాయి. ఈ తరహాలోనిదే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లుకొడుతుంది.


ఓ పైలట్ హెలికాప్టర్ లో దంపతులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఈ తరుణంలో వారితో ప్రాంక్ చేయాలని అనుకున్నాడు. అయితే ఒక్కసారిగా వారిద్దరు హెలికాప్టర్ నుంచి వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పైలట్ మూర్చపోయినట్లు నటించాలని అనుకున్నాడు. దీనిని వీడియో కూడా తీసుకున్నాడు. మూర్చపోయినట్లు ఒక్కసారిగా తలను పక్కకు జరిపి పడుకున్నాడు. దీంతో ప్రయాణికులైన దంపతులు ఇద్దరు ఏడవడం ప్రారంభించారు.

దీంతో పైలట్ మళ్లీ లేచి తాను ప్రాంక్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లుకొడుతుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి నిజంగా అలా జరిగితే ప్రయాణికుల పరిస్థితి ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×