Big Stories

Idly Making in Coconut Shell: కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ.. ఇదెక్కడి క్రియెటివిటీరా మావా..?

Man Making Idly in Coconut Shell in Bangalore: భారతీయ వంటకాల్లో అందరూ ఇష్టంగా తినే టిఫిన్ ఏదంటే ఇడ్లీ, సాంబార్ అనే అంటారు. ఇండియాలో ఇడ్లీ అంత ఫేమస్ మరి. ఏ టిఫిన్ సెంటర్లో చూసినా ఇడ్లీనే ఎక్కువ సేల్ అవుతుంది. ఇడ్లీని సాంబార్ లో వేసుకుని, దానిని కారం పొడి కలిపి, అల్లం చట్నీతో తింటే అబ్బా ఆ రుచి అద్భుతం.. అమోగం అంతే. అందుకే ఇడ్లీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇడ్లీలు ఒకప్పుడు కేవలం కుక్కర్ లో ఉడకబెట్టి తినేలా మాత్రమే ఉండేవి. అదే ఇప్పుడు ఎన్ని రకాల ఇడ్లీలు వచ్చాయో. మసాలా ఇడ్లీ, కారం ఇడ్లీ, తవా ఇడ్లీ, బటర్ ఇడ్లీ, పనీర్ ఇడ్లీ, పాన్ ఇడ్లీ అని చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి మరి. అయితే తాజాగా మరొక రకమైన ఇడ్లీ ఒకటి నెటిజన్లకు దర్శనమిచ్చింది. మిరి అదేంటో తెలుసుకుందాం.

- Advertisement -

ఇడ్లీలను కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టి తయారు చేయడం చూసే ఉంటాం. కానీ ఇడ్లీని కొబ్బరి చిప్పల్లో పెట్టి తయారు చేయడం ఎప్పుడైనా చూశారా. తాజాగా ఓ టిఫిన్ బండి మీద ఓ వ్యక్తి ఇడ్లీలను కొబ్బరి చిప్పల్లో తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. బెంగుళూరుకు చెందిన ఓ ఫుడ్ స్టాల్ బాయ్ ఇడ్లీని కొబ్బరి చిప్పల్లో అద్భుతంగా తయారు చేశాడు.

- Advertisement -

 

Also Read: అదేంటి దుబాయ్‌లో ఆకాశం పచ్చరంగులోకి మారింది.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

ముందుగా కొబ్బరి కాయలను తీసుకుని వాటిని పగలకొట్టాడు. అనంతరం అందులో నుండి కొబ్బరిని తురిమాడు. ఆ తర్వాత వాటిని నీటిగా క్లీన్ చేసి ఓ పెద్ద టేబుల్ పై ఉన్న ప్లేట్లో పెట్టాడు. అనంతరం వాటిలో క్యారెట్ ముక్కలు పెట్టి అందులో ఇడ్లీ పిండిని వేశాడు. ఆ తర్వాత దానిని ఓ పెద్ద పాత్రలో పెట్టి ఉడకబెట్టాడు. కాసేపటి తర్వాత వాటిని బయటకు తీసి వాటిలో నెయ్యి, పొడిని చల్లాడు. ఇక ఏముంది అందరికి కొబ్బరి ఆకుల్లో పెట్టి చట్నీలతో సెర్వ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News