Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ఆహారానికి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్నాయి. తరచూ ఒక్కో ప్రాంతానికి చెందిన వెరైటీలను ఫుడ్ వ్లాగర్లు వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఫేమస్ ఫుడ్ వెరైటీని టేస్ట్ చేసి, దానికి సంబంధించిన వివరాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఆహారాన్ని తయారుచేసే విధానం నుంచి మొదలుకుని దాని ప్రత్యేకత ఏంటి, ఎంతలా దానికి అభిమానులు ఉన్నారో కూడా వీడియో రూపంలో తెలియజేస్తుంటారు. ఈ తరుణంలో కొన్నిసార్లు ఆహారానికి సంబంధించిన కొన్ని భయంకర వీడియోలు కూడా బయటపెడుతుంటారు.
ఆరు బయట లభించే ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచికి అద్భుతంగా ఉంటాయని లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. కానీ అసలు తినడానికి రుచి మాత్రమే చూడకుండా నాణ్యత గురించి కూడా ఓ సారి ఆలోచించాలి. తాజాగా చాలా రకాల ఫుడ్ వెరైటీస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మోమోస్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బయట ఫాస్ట్ ఫుడ్, మోమోస్, పిజ్జాలు, బర్గర్ లు వంటి వాటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా ఇందులో ఆహార ప్రియులకు ఇష్టమైన మోమోస్ కు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంతో ఇష్టంగా తినే మోమోస్ పిండిని ఓ వ్యక్తి దారుణంగా కలిపాడు. ఓ గిన్నెలో పిండి వేసి దానిని కాళ్లతో తొక్కి కనీసం కవర్స్ లేకుండా కలిపాడు. దీనిని కొంత మంది వీడియో తీశారరు. కేవలం బనియన్ వేసుకుని కట్ డ్రాయర్ ధరించి మైదా పిండిని కాళ్లతో తొక్కుతూ కలిపాడు. దీంతో మోమోస్ రుచిగా రావాలని మరీ ఇంత దారుణంగా పిండి కలపడం ఏంటని ఇలాంటి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
मध्यप्रदेश के जबलपुर में आज पैरों से मैदा गूंथकर मोमोज बनाने की Video सामने आई। पुलिस ने मोमोज दुकान संचालक राजकुमार गोस्वामी और सचिन गोस्वामी को गिरफ्तार किया है। pic.twitter.com/uME8Sx52JM
— PUNEET VIZH (@Puneetvizh) September 7, 2024