BigTV English

Viral Video: మాల్‌ లో మృగరాజు.. అది పట్టుకుని పండగ చేసుకుందిగా.. నిజమేనా బ్రో?

Viral Video: మాల్‌ లో మృగరాజు.. అది పట్టుకుని పండగ చేసుకుందిగా.. నిజమేనా బ్రో?

అడవిలో ఉండాల్సిన జంతువులు నగరాల్లోకి అడుగు పెడుతున్నాయి. రీసెంట్ గా థాయ్ లాండ్ లో ఓ ఏనుగు నేరుగా గ్రాసరీ స్టోర్ లోకి వెళ్లి తనకు నచ్చిన ఆకు కూరలు, కూరగాయాలు అన్నింటినీ తినేసింది. పప్పులు కూడా కావాల్సినన్ని తిన్నది. కాసేపట్లోనే ర్యాక్స్ అన్నీ ఖాళీ చేసేసింది. సుమారు అరగంట పాటు మాల్ లోనే ఉండి నచ్చిన ఫుడ్ తినేసింది. కడుపు నిండిన తర్వాత మాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది.  ఏనుగు వెళ్లిన తర్వాత నెమ్మదిగా స్టోర్ అంతటినీ శుభ్రంగా మళ్లీ సర్దేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటన మర్చిపోక ముందే మృగరాజు షాపింగ్ చేసింది. మృగరాజు ఏంటి? షాపింగ్ చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.!


గ్రాసరీ స్టోర్ లోకి మృగరాజు ఎంట్రీ

అడవిలో ఎంజాయ్ చేయాల్సిన మృగరాజు తాజాగా ఓ గ్రాసరీ స్టోర్ లోకి అడుగు పెట్టింది. ఒక్కసారిగా సింహం మాల్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో స్టోర్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. లోపలికి వెళ్లిన సింహం నేరుగా మాంసం నిల్వ చేసే దగ్గరికి వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన మాంసాన్ని తీసుకుని హాయిగా తినేసింది. రకరకాల మాంసాలను రుచి చూసింది. సుమారు అరగంట పాటు స్టోర్ లోనే ఉండి, తనకు నచ్చిన మాంసాన్ని కింద వేసుకుని నచ్చినంత తినేసింది. ఈ తతంగం అంతా స్టోర్ లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


Read Also: భయపెడుతోన్న జులై 5.. టికెట్లు క్యాన్సల్ చేసుకుంటోన్న జనం!

ఇంతకీ ఈ వీడియో నిజమైనదేనా?

గ్రాసరీ స్టోర్ లోకి వెళ్లి మాంసం తిన్న సింహం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో నిజమైనదే అని కొంత మంది అంటే, ఏఐ క్రియేటెడ్ వీడియో అని మరికొంత మంది అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేశాయి. అయితే, ఈ వీడియో నిజం కాదని తేల్చాయి. దానిని పూర్తి ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్లు వెల్లడించాయి. ఈ ఘటన నిజంగా జరగలేదని తెలిపాయి. మరోవైపు ఇలాంటి వీడియోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏవి నిజమైనవో? ఏవి నకిలీవో తెలుసుకోవడం కష్టంగా ఉందంటున్నారు. అంతేకాదు, పలువురు నిపుణులు కూడా ఈ వీడియోను చూసి ఫేక్ వీడియో అంటున్నారు. సౌత్ ఆఫ్రికాలో సింహాలు గడ్డిభూములు, అటవీ ప్రాంతాల్లో ఉంటాయే తప్ప నగర ప్రాంతాల్లోకి రావంటున్నారు. జనావాసాల్లోకి కూడా ఈ క్రూర మృగాలు రానే రావంటున్నారు. వచ్చినా, అక్కడ ఉండలేవని చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏఐ క్రియేటెడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Read Also: ఇదేం చిత్రం.. మనిషి లేకుండా బైక్ దానంతట అదే పరుగు, వీడియో వైరల్!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×