బైక్ మీద వెళ్లే సమయంలో తరచుగా స్కిడ్ అయి పడిపోతుంటారు. కొన్నిసార్లు రైడర్స్ బైక్ మీది నుంచి జారిపడుతుంటారు. అలా పడిపోయిన సమయంలో కొన్నిసార్లు బైక్ కొంత ముందుకు వెళ్లి కిందపడిపోతుంది. కొన్ని బైకులు రెండు మూడు మీటర్ల దూరం వెళ్లి పడిపోతే, మరికొన్ని బైకులు మరికాస్త దూరం వెళ్లి పడిపోతాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రైడర్ లేకుండా కిలో మీటరకు పైగా ప్రయాణించిన బైక్
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు ఓ ప్లాన్ చేస్తారు. ఓ యువకుడు రన్నింగ్ బైక్ మీది నుంచి కిందికి దూకేస్తాడు. కాస్త ముందు మరో యువకుడు ఉండి దాన్ని పట్టుకోవాలి అనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఓ యువకుడు ఆ బైక్ మీది వచ్చి నెమ్మదిగా దాని మీద నుంచి దూకేస్తాడు. కాస్త ముందుకు వెళ్లాక మరో యువకుడు దాన్ని పట్టుకునేందుకు రెడీగా ఉంటాడు. అయితే, ఆ బైక్ ను అతడు ఆపలేకపోతాడు. అక్కడి నుంచి ఆ బైక్ వేగంగా ముందు దూసుకెళ్లింది.
ఒక మీటరు కాదు, రెండు మీటర్లు కాదు, అలా ముందుకు వెళ్తూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న పొదలు ఎదురైనా, వాటి మీది నుంచి దూసుకుంటూ వెళ్లింది. పైకి జంప్ చేసుకుంటూనే ముందుకుసాగింది. ఆ బైక్ అలా వెళ్తూనే ఉంది. మరో వ్యక్తి ఆ బైక్ ను వీడియో తీస్తూ వెళ్లాడు. సుమారు కిలో మీటరుకు పైగా ఆ బైక్ వెళ్లింది. ఆ తర్వాత కూడా ముందుకు వెళ్లినట్లే కనిపిస్తుంది. కానీ, వీడియో పూర్తిగా లేదు. అయినప్పటికీ ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. బైక్ మీద రైడర్ లేకుండా అంత దూరం వెళ్లడం ఏంటి? అదీ, పొదల మీది నుంచి ఎగురుతూ, దూకుతూ వెళ్లడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు.
ये कमाल कैसे हुआ भई 🥺 pic.twitter.com/CJZLTDEq3I
— Simple girl❤️ (@RathoreBaissa1) June 17, 2025
Read Also: దేశంలోనే బిజీయెస్ట్ రైల్వే స్టేషన్, రోజూ ఎన్ని వందల రైళ్లు నడుస్తాయంటే?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజంగా కాదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కూడా ఏఐ మాయగా కొట్టిపారేస్తున్నన్నారు. “కాసేపు ఏఐ ముందుకు కూర్చుంటే ఇలాంటి వీడియోలు వంద క్రియేట్ చెయ్యొచ్చు” అని ఓ వ్యక్తం రాసుకొచ్చాడు. “బహుశ ఈ బైక్ ను దెయ్యం నడిపి ఉంటుంది” అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఇలాంటి వీడియో చూడటం నా జీవితంలో మొదటిసారి” అని మరో వ్యక్తం కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Read Also: విమానంలో ఎకానమీ, బిజినెస్ క్లాస్ మధ్య ఇంత తేడానా? మీరు అస్సలు నమ్మలేరు!