Jabardasth Anchor: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం బుల్లితెరపై ఎన్నో రకాల ఈ కార్యక్రమాలు ప్రచారం అవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే గత దశాబ్ద కాలంపైగా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ (Jabardasth)కామెడీ షో మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగాను దర్శకులు, కమెడియన్లుగాను గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమానికి మరొక యాంకర్ వచ్చారని తెలుస్తుంది.
సుడిగాలి సుదీర్…
జబర్దస్త్ కార్యక్రమం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో ఆడియన్స్ ఉండే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో వినోదం రెండింతలు ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి రష్మీ(Rashmi) మాత్రమే కాకుండా మరొక యాంకర్ కూడా రాబోతున్నారని వెల్లడించారు అయితే ఇదివరకు వచ్చిన ప్రోమోలో ఫేస్ రివిల్ చేయకుండా చూపించడంతో కచ్చితంగా సుధీర్ (Sudheer)ఈ కార్యక్రమంలోకి రాబోతున్నారని అందరూ భావించారు.
యాంకర్ గా బిగ్ బాస్ మానస్…
సుధీర్ కనక జబర్దస్త్ కార్యక్రమంలోకి వస్తే రేటింగ్స్ భారీగా పెరిగిపోతాయని అందరూ భావించారు కానీ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి యాంకర్ గా సుదీర్ కాకుండా బుల్లితెర నటుడు మానస్ (Maanas)వచ్చారని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మానస్ కాకుండా సుధీర్ అయి ఉంటే ఈ షో భారీ రేటింగ్ సొంతం చేసుకునేదని మానస్ రావడంతో ఈ షో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇలా మానస్ యాంకర్ గా ప్రేక్షకులు దాదాపు ఇష్టపడటం లేదని స్పష్టమవుతుంది.
Also Read: Akhanda 2: ఊహించని రీతిలో అఖండ 2 బిజినెస్.. డబుల్ హ్యాట్రిక్ గ్యారంటీ!
ఇక సుధీర్ రష్మి జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరు జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేస్తున్న సమయంలో రష్మీ సుధీర్ స్కిట్ లో పర్ఫామెన్స్ చేస్తూ ఉండేవారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అభిమానులు కూడా భావించారు . ఇక సుధీర్ రష్మీ మాత్రం ఈ వార్తలపై పలు సందర్భాలలో స్పందిస్తూ మా ఇద్దరి మధ్య అందరూ అనుకున్నట్టు ఏమీ లేదని, మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చారని ఎంతో ఆనందపడే లోపు జబర్దస్త్ టీం మానస్ ను తీసుకువస్తూ అభిమానులను నిరాశపరిచారని చెప్పాలి.మరి మానస్ జబర్దస్త్ యాంకర్ గా తన మాటతీరుతో సుదీర్ ను మరిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.