Viral Video: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని థానే జిల్లాలో కల్యాణ్‌లోని నందివలి ప్రాంతంలో ఒక ప్రైవేట్ క్లినిక్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సోనాలి కలసరే(25) అనే యువతిపై ఓ వ్యక్తి అతి కిరాతకంగా దాడి చేశాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. దాడి జరిగిన ఘటన.. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో బయటకొచ్చింది. దీన్ని చూసిన నెటిజన్లు దాడి చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో రోజు రోజుకీ మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారని ఫైరవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని, థానె జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో సోమవారం రోజున ఈ ఘటన జరిగింది. డాక్టర్ అనికేత్ పాలందే నడుపుతున్న శ్రీ బాలచికిత్సక క్లినిక్‌లో ఘటన చోటుచేసుకుంది. సోనాలి అనే యువతి అందులో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. అయితే డాక్టర్ ఒక మెడికల్ రిప్రెజెంటేటివ్‌తో సమావేశంలో ఉన్నందున గోకుల్ అనే వ్యక్తిని కాసేపు వెయిట్ చేయండని కోరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువకుడు సోనాలిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ వీడియో రికార్ట్ అయింది. అతను ఆమెను జుట్టు పట్టుకుని నేలపైకి లాగి.. ఆమె కడుపులో కాలుతో బలంగా తన్నాడు. ఆ తర్వాత ఆమెను ఇష్టమొచ్చినట్టు కొట్టినట్టు కూడా వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడిలో సోనాలికి తీవ్ర గాయాలయ్యాయి.
A person named Gopal Jha has beaten a "Hindu Marathi hospital's receptionist" in Kalyan!
An immigrant goon has beaten a local girl!
Let's see how double standards news you AIR, or you completely ignore the news!@ndtv @ShivAroor
— सुमित बने (@BaneMNS) July 22, 2025
సోనాలిది థానే జిల్లాలోనే పిసావలి గ్రామం. ఆమె రెండు షిప్ట్ లలో క్లీనిక్ లో పని చేస్తోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓ షిఫ్ట్ లో.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మరో షిప్ట్ లో పనిచేస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన రోజు డాక్టర్ కాస్త ఆలస్యంగా వచ్చాడు, దీంతో అప్పటికే ఐదుగురు పేషంట్లు వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో గోకుల్ కూడా ఓ పేషంట్ తో క్లీనిక్ వచ్చాడు. సోనాలి అతన్ని కాసేపు వెయిట్ చేయండని అడగడంతో.. వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త దాడికి దారితీసింది.
సోనాలి మన్‌పడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. గోకుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు వాడు మనిషేనా.. అమ్మాయి ప్రవర్తించే తీరు అదేనా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇలాంటి వెదవకు పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి’ అని మరో వ్యక్తి కామెంట్ చేసుకొచ్చాడు.
ALSO READ: CM Revanth Reddy: మరో మైలురాయిని దాటేసిన తెలంగాణ ఆర్టీసీ.. ఏకంగా 200 కోట్ల మంది మహిళలు..?
ALSO READ: Plane Crash: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. ఒక్కసారిగా ప్రయాణికులంతా..?