OTT Movie : ఎన్నో సినిమాలు మనం చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా యాక్షన్, హై-డ్రామా లేకుండా, సింపుల్‌గా, హార్ట్‌వార్మింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా ఒక రిటైర్డ్ జంట లాటరీలో ఒక గణిత లోపాన్ని ఉపయోగించి మిలియన్ల డాలర్లు గెలుచుకుంటుంది. ఆ డబ్బుతో తమ ఊరిని బాగుచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫీల్-గుడ్ సినిమా మంచి పనులు చేసే సాధారణ మనుషుల కథ లాగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Jerry & Marge Go Large’ 2022లో విడుదలైన ఒక అమెరికన్ ఫీల్ గుడ్ సినిమా. ఇది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన స్టోరీ. దీన్ని డైరెక్టర్ David Frankel తీశాడు. Bryan Cranston (జెర్రీ సెల్బీగా) Annette Bening (మార్జ్ సెల్బీగా) లీడ్ రోల్స్‌లో నటించారు. Amazon Prime Video, Apple TV, Google Play Movies లలో ఈ సినిమాని స్ట్రీమ్ చేయవచ్చు. 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDbలో 6.9/10, Rotten Tomatoesలో 68% రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
జెర్రీ సెల్బీ (Bryan Cranston) ఒక రిటైర్డ్ ఫ్యాక్టరీ మేనేజర్. మిచిగాన్‌లోని ఒక చిన్న ఊరిలో తన భార్య మార్జ్ (Annette Bening)తో కలిసి జీవిస్తుంటాడు. రిటైర్మెంట్ తర్వాత జెర్రీకి టైమ్‌పాస్ కష్టంగా ఉంటుంది. ఒక రోజు అతను మసాచుసెట్స్‌లోని “WinFall” అనే లాటరీ గేమ్‌లో ఒక మ్యాథమెటికల్ లోపం గుర్తిస్తాడు. ఈ లోపం వల్ల, రోల్‌డౌన్ వీక్స్‌లో (జాక్‌పాట్ గెలవనప్పుడు డబ్బు చిన్న టైర్ విన్నర్స్‌కి వెళ్తుంది) గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జెర్రీ, మార్జ్‌తో కలిసి ఈ లోపాన్ని ఉపయోగించి లాటరీ టికెట్లు కొనడం మొదలుపెడతాడు. మొదట చిన్నగా స్టార్ట్ చేసి, తర్వాత వాళ్ల సేవింగ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ల ప్లాన్ వర్కౌట్ అవుతుంది.
సుమారు $27 మిలియన్ డాలర్లు గెలుస్తారు. ఈ డబ్బుతో వాళ్ల ఊరిని రివైవ్ చేస్తారు. స్కూళ్లు, రోడ్లు, లైబ్రరీలను బాగుచేస్తారు. వాళ్ల స్కీమ్‌ని స్నేహితులు, పొరుగువాళ్లతో షేర్ చేసి “GS Investment Strategies” అనే గ్రూప్‌ని ఫామ్ చేస్తారు. కానీ ఒక కాలేజ్ స్టూడెంట్ ఈ సిస్టమ్‌ని స్వార్థం కోసం ఉపయోగించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు జెర్రీ, మార్జ్ ఈ గేమ్‌ని అందరికీ ఫెయిర్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. చివరికి లాటరీ యాజమాన్యానికి ఈ విషయం తెలుస్తుందా ? ఈ స్టోరీ ఎండింగ్ ఎలా ఉంటుంది ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : అపార్టుమెంట్లో అర్ధరాత్రి అలాంటి సౌండ్స్… బ్యాచిలర్ కు నిద్ర పట్టకుండా చేసే పక్కింటి జంట