E-Paper
Advertisement

టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!

టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!
Advertisement

క‌విత పార్టీ పేరును చివ‌ర వ‌ర‌కు స‌స్పెన్స్‌లో ఉంచ‌డంలో స‌క్సెస‌య్యార‌ని మ‌నం గ‌తంలో చెప్పుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సేన అని టీఆరెస్ పేరు వ‌చ్చేలా ఆమె రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డ‌మంటేనే ఆమె టార్గెట్ ఎవ‌రో అంద‌రికీ తెలిసిపోయింది. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం రెండూ బీఆరెస్సే. అందుకే క‌విత టార్గెట్ కూడా బీఆరెస్సే. తెలంగాణ పేరును తీసేసి.. త‌న ఉనికిని, ఇక్క‌డి ఆత్మ‌ను దూరం చేసుకున్నారు కేసీఆర్‌. అందుకే క‌విత త‌న రాజ‌కీయ పార్టీ పేరులో దీన్నే ప్ర‌ధానంగా తీసుకున్నారు.

ఇప్పుడు ఇదే ప్రామాణికం కూడా కానున్న‌ది. బీఆరెస్ అని పేరు పెట్టిన సంద‌ర్భంలోనే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇది ప‌క్కా కేసీఆర్ నిర్ణ‌యమే. కేసీఆర్ ఒక్క‌సారి నిర్ణ‌యం తీసుకున్నారంటే దానికి తిరుగులేదు. ఆయ‌న చుట్టూ ఉన్న భ‌జ‌న బ్యాచ్ దీనికి భ‌జంత్రీలు కొట్ట‌డ‌మే త‌ప్ప‌.. ఇది త‌ప్పు.. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతుంది. ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌వు.. దూర‌మ‌వుతారు..అనే హిత వ్యాఖ్య‌లు వారికి రావు. కేసీఆర్‌కు త‌న ద‌గ్గ‌ర త‌న‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే వారుండొద్దు.. ఆయ‌న నిర్ణ‌యాల‌కు జేజేలు కొట్టేవారుండాలి. ఆయ‌న పాల‌న‌కు భుజ‌కీర్తులు త‌గిలించి పొగ‌డ్త‌ల మ‌త్తును జ‌ల్లే మందీ బార్బ‌ల‌మే కావాలి. అందుకే ప‌దేళ్ల పాల‌న‌లో ఆయ‌న ఏం చేసినా.. ఎవ‌రూ వ్య‌తిరేకించ‌లె. కిమ్మ‌న‌లే. బీఆరెస్ పార్టీ పేరు పెట్టిన‌ప్పుడు కూడా అందే. దీని వ‌ల్ల త‌రువాత క్ర‌మంలో బీఆరెస్ ప్ర‌జ‌ల‌కు ఎలా దూర‌మైంది.

Advertisement

ప‌త‌న‌మ‌వుతూ వ‌స్తున్న క్ర‌మం అంతా చూస్తూనే ఉన్నారు. ఈ ప‌రిణామ‌ల‌ను క‌విత నిశితంగా ప‌రిశీలిస్తూ వ‌స్తున్నారు. మ‌నం గ‌తంలో చెప్పుకున్న‌ట్టుగానే కేసీఆర్ చేసిన త‌ప్పిదాలు, లోపాలనే ఆమె త‌న కొత్త పార్టీకి పాఠాలుగా తీసుకున్నారు. త‌న ఎజెండాను అదే విధంగా రూపొందించుకున్నారు. పార్టీ పేరును ఆమె టీఆరెస్ అని ప్ర‌క‌టించిన త‌రువాత అంద‌రి క‌న్నా ముందుగా.. అవాక్క‌య్యింది.. నివ్వెర‌పోయిది.. బీఆరెస్సే. కేటీఆర్‌, కేసీయారే! అవును. ఆమె స‌మ‌యం, సంద‌ర్భం చూసి, అదును చూసి కొట్టిన ఈ దెబ్బ బ‌లంగానే తాకింది వారికి. ఈ ఒక్క ప‌రిణామాన్ని చూస్తే చాలు క‌విత రూటు ఎలా ఉండ‌బోతుంది. ఆమె పంథా ఎట్లా సాగ‌బోతున్న‌ది.

టీఆరెస్ అంటేనే ఒక‌ప్పుడు ఇంటి పార్టీ. అంత‌లా అది తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో, భావోద్వేగాల‌తో క‌ల‌స‌గ‌లి ఉన్న‌ది. అలాంటి పార్టీని దూరం చేసుకున్నారు. పార్టీ పేరు మార్చారు. విధ‌నాలూ మారాయి. ఇప్పుడు అదే పేరును మ‌ళ్లీ త‌న కొత్త పార్టీకి పెట్టుకుని.. ఇంటి పార్టీగా త‌న పార్టీ ఆ పాత్ర‌ను పోషించ‌నుంద‌ని నేరుగా జ‌నానికి అప్పీలు చేసుకున్నారు క‌విత‌.

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×